Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయ చట్టాల రద్దు : పార్లమెంటులో ప్రకటన చేసేవరకు ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది.. రైతులు...

శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే, ఢిల్లీకి సమీపంలోని Singh borderల్లో  చేస్తున్న రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళదామని అంటున్నారు.  పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరమని Farmers ముక్తకంఠంతో చెప్పారు.

Farm Laws Repeal : farmers to leave protest sites only after proceedings starts in parliament
Author
Hyderabad, First Published Nov 19, 2021, 12:11 PM IST

ఢిల్లీ :  మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా రైతులు మాత్రం నిరసన కొనసాగిస్తామని అంటున్నారు. సింఘు సరిహద్దుల్లో  నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులు  తిరిగి ఇళ్లకు వెళ్లాలని  ప్రధాని కోరారు.

అయితే ఢిల్లీకి సమీపంలోని Singh borderల్లో  చేస్తున్న రైతులు మాత్రం దీనిపై చట్టం చేశాకే తిరిగి ఇళ్లకు వెళదామని అంటున్నారు.  పార్లమెంటులో చట్టాలను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మాత్రమే తాము నిరసన స్థలం నుంచి బయలుదేరమని Farmers ముక్తకంఠంతో చెప్పారు.

కేంద్రం గత ఏడాది సెప్టెంబర్లో తీసుకువచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదికాలంగా ఆందోళన చేశారు దీంతో దిగొచ్చిన కేంద్రం మూడు వివాదాస్పద చట్టాలను  ఎట్టకేలకు  రద్దు చేయనుంది.

కాగా, శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాబోయే parliament winter session 2021లో దీనిపై ప్రకటన చేస్తామని వెల్లడించారు. రైతులందరినీ క్షమాపణ కోరుతున్నట్టుగా మోదీ చెప్పారు. రైతులు  ఆందోళన విరమించాలని కోరారు. కాగా, ఈ three farm laws  రద్దు చేయాలని గత ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 

చైనాతో పోరాడిన సమర యోధుడిని రెజాంగ్ లాకు వీల్ చైర్‌లో తీసుకెళ్లిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. వీడియో

ఇంకా PM Modi మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని చెప్పారు. బడ్జెట్‌లో రైతులకు కేటాయింపులు ఐదు  రెట్లు పెరిగాయని తెలిపారు. ‘మేము దేశంలోని గ్రామీణ మార్కెట్లను బలోపేతం చేసాము. చిన్న రైతులను ఆదుకోవడానికి అనేక పథకాలు తీసుకొచ్చాం. రైతులకు బడ్జెట్ కేటాయింపులు ఐదు రెట్లు పెరిగాయి. మైక్రో ఇరిగేషన్‌కు కూడా రెట్టింపు నిధులు ఇచ్చాం’ అని మోదీ  తెలిపారు. 

చిన్న రైతుల సాధికారత, బలోపేతానికి మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని.. ఇది రైతులు, ఆర్థికవేత్తలు, వ్యవసాయ నిపుణుల డిమాండ్ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రైతులకు సరసమైన ధరలకే విత్తనాలు, 22 కోట్ల సాయిల్ హెల్త్ కార్డుల వంటి సౌకర్యాలను అందించడానికి తాము కృషి చేసినట్టుగా చెప్పారు. వ్యవసాయోత్పత్తిని పెంచడానికి ఇటువంటి అంశాలు దోహదపడ్డాయని వెల్లడించారు. తాము ఫసల్ బీమా  యోజనను  బలోపేతం చేశామని.. మరింత మంది రైతులను దాని కిందకు తీసుకొచ్చామని మోదీ అన్నారు. 

దీనిమీద పలువురు ప్రముఖులు స్పందించారు. దీని మీద తెలంగాణ ఐటీ మంత్రి KTR స్పందించారు. అధికారంలో ఉన్నవారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది మరోసారి నిరూపితమయ్యింది అన్నారు. ‘పవర్ ఉన్నవారి కంటే ప్రజల పవర్ ఎప్పటికీ శక్తివంతమైనదే’ Indian farmers దీనిని నిరంతర ఆందోళనతో తాము అనుకున్నది సాధించి నిరూపించారు. ‘జై జవాన్.. జై కిసాన్’ అని కేటీఆర్ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios