Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: జార్ఖండ్‌లో కుటుంబం బహిష్కరణ, విచారణకు ఆదేశం

:కరోనా వైరస్ సోకిందనే నెపంతో  ఓ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించిన  ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.జార్ఖండ్ రాష్ట్రంలోని రాంఘర్ జిల్లాలోని గోపాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మురిద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

Family faces boycott over Covid-19 rumour, Jharkhand CM orders probe
Author
Jharkhand, First Published Apr 23, 2020, 4:13 PM IST


రాంచీ:కరోనా వైరస్ సోకిందనే నెపంతో  ఓ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించిన  ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.జార్ఖండ్ రాష్ట్రంలోని రాంఘర్ జిల్లాలోని గోపాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల మురిద్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

దీదీ కిచెన్ సెంటర్ లో గీతా దేవి పనిచేస్తోంది. జార్ఖండ్ స్టేట్ లైవ్‌లీ హుడ్ ప్రమోషన్ సోసైటీ ఆధ్వర్యంలో దీదీ కిచెన్ సెంటర్ నడుస్తోంది.కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం దీదీ కిచెన్ సెంటర్లను నిర్వహిస్తోంది. గ్రామంలో చాలా మంది రేషన్ పొందడానికి తాను సహాయం చేశానని గీతా దేవి చెప్పారు.

ఈ నెల 18వ తేదీన దీదీ కిచెన్ సెంటర్ ద్వారా పేదలకు భోజనం వడ్డిస్తున్న సమయంలో కొందరు గ్రామస్తులు ఆమె వద్దకు వచ్చి  నీకు కరోనా వైరస్ సోకిందని ఆరోపించారు.

అయితే నాకు కరోనా వైరస్ సోకిందని ఎలా చెబుతారని ఆమె గ్రామస్థులను ప్రశ్నించారు. అయితే మీ ఇంటికి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి మీ బావ వచ్చాడు. అంతేకాదు అతనికి కరోనా ఉందని ఆరోపించారు.

తన ఇంటికి ఎవరూ కూడ రాలేదని ఆమె గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ, గ్రామస్తులు వినలేదు. గీతా దేవి భర్త  ఈశ్వర్ కుమార్ మహాతో దినసరి కూలీ.లాక్‌డౌన్ నేపథ్యంలో మహాతోకు పని లేకుండా పోయింది. 

ఏప్రిల్ 19వ తేదీన మంచినీటి బోరు వద్దకు నీళ్లు తెచ్చుకొనేందుకు వెళ్లిన దేవీని గ్రామస్తులు అడ్డుకొన్నారు. కరోనా సోకిందని ఆమెను నీళ్లు తీసుకెళ్లకూడదని అడ్డుకొన్నారు.ఆ రోజున నీళ్లు లేక ఆమె వంట చేయలేదు.

గ్రామస్తుల ఆరోపణలను అబద్దమని నిరూపించేందుకు  ఆమె ప్రయత్నించింది. తన కుటుంబం మొత్తం వెళ్లి పరీక్షలు చేయించుకొంది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.అయితే 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు.

కరోనా రాలేదని వైద్యులు నివేదిక ఇచ్చినా కూడ ఆ కుటుంబాన్ని గ్రామం విడిచిపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ 20వ తేదీన ఎల్పీజీ సిలిండర్  రీఫిల్లింగ్ చేయించుకోవాలని ఆమె ప్రయత్నిస్తే గ్రామస్తులు అడ్డుకొన్నారు.

also read:కరోనా ఎఫెక్ట్: పెంచిన డిఏ చెల్లింపు నిలిపివేత

కనీసం ఇంటి నుండి బయటకు రాకుండా గ్రామస్తులు అడ్డుకొన్నారని ఆమె కన్నీరుమున్నీరైంది. గ్రామస్తుల వేధింపులను తట్టుకోలేక ఈ నెల 21వ తేదీన ఆమె గోలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఈ నెల 22వ తేదీన గోలా పోలీసులు గ్రామాన్ని సందర్శించారు. గీతా కుటుంబం నీళ్లు తీసుకొనేందుకు తాము సహాయం చేశామని పోలీసులు చెప్పారు. అంతేకాదు గీతా కుటుంబాన్ని వేధిస్తే కేసులు పెడతామని హెచ్చరించినట్టుగా గోలా పోలీస్ స్టేషన్ ఇంచార్జీ ధనుంజయ్ కుమార్ చెప్పారు.తమ ఇంట్లోని పాత్రలన్ని నీటితో నింపడంతో గురువారం నాడు ఇంటి నుండి బయటకు రాలేదని ఆమె చెప్పారు. ఈ ఘటనపై సీఎం విచారణకు ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios