ఓ వ్యక్తి మిలిటరీ యూనిఫాం ధరించి... తాను ఆర్మీ అధికారినంటూ బిల్డప్ కొట్టాడు. ఆర్మీ అధికారులు ఉండే ప్రాంతానికి వెళ్లి అక్కడ హల్ చల్ చేశాడు. తీరా నకిలీ అని తేలడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి చెందిన నీరజ్ పాండే అనే వ్యక్తి మిలటరీ యూనిఫాం ధరించి మిలటరీ ప్రాంతంలో సంచరిస్తున్నాడు. నీరజ్ పాండే ఆర్మీ లెఫ్టినెంట్ ర్యాంక్ అధికారి లాగా ఫోజు కొడుతూ కంటోన్మెంటు ప్రాంతంలో తిరుగుతుండగా అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి రాంకృష్ణ చతుర్వేది చెప్పారు. 

కాగా ఆర్మీ అధికారిని అని చెప్పి స్నేహితుల మెప్పు పొందేందుకే తాను మిలటరీ యూనిఫాం వేసుకున్నానని నీరజ్ పాండే పోలీసులకు చెప్పారు. పాండే మిలటరీ దుస్తులు ధరించడం వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.