వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే కారణంతో ఓ జంటను స్థంభానికి కట్టేసి కొట్టారు. వారిద్దరనీ గంటల తరబడి అలాగే ఉంచి చిత్ర హింసలకు గురి చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది.
త్రిపురలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి పెళ్లయిన యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వారిద్దరిని వీధిలోకి లాక్కొచ్చి, స్థంభానికి కట్టేసి కొట్టారు. వారిద్దరినీ ఘోర అవమానానికి గురి చేశారు. ఎందరో ఈ ఘటనను చూస్తున్నా.. ఆపడానికి మాత్రం రాలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. దక్షిణ త్రిపుర జిల్లాలోని బెలోనియా పట్టణానికి చెందిన ఓ వివాహితుడు అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువతితో కొంత కాలం నుంచి ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆ వివాహితుడికి ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆ యువతి తన కజిన్ సోదరుడు, మరదలితో కలిసి జీవిస్తోంది. అయితే ఆ వివాహితుడు, యువతి చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు.
దీనిని ఆమె బంధువులు గమనించారు. కాగా.. శనివారం వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో బంధువులు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ లాక్కొచ్చి స్థంభానికి కట్టేశారు. అనంతరం వారిని దారుణంగా కొట్టారు. గంటల తరబడి అలాగే ఉంచి హింసిస్తూ అవమానించారు. ఈ దుశ్చర్యను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైరల్ గా మారిది.
ఆ వీడియో ఓ వృద్ధురాలు స్థంభానికి కట్టేసి ఉన్న ఆ యువతి తల వెంట్రుకలను లాగి పదేపదే కొడుతోంది. ఆ వ్యక్తిని అదే విద్యుత్ స్తంభానికి కట్టేసి కూడా కొడుతున్నారు. ఈ దాడిని కొందరు చూస్తున్నా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. అంతలో మరో వ్యక్తి ఆవేశంగా చేతి వేళ్లను ఊపుతో ఆ జంను గట్టిగా బెదిరించాడు.
ఈ ఘటనపై సమాచారం అందటడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. బాధితులను స్థంభం నుంచి విడిపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. బాధిత వివాహితుడు, యువతితో సహా అక్కడున్న ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కాగా.. ఈ ఘటనల యువతి కజిన్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆమె మరదలు కూడా ఈ భౌతిక దాడి కేసులో నిందితురాలిగా చేర్చారు.
