Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ : నగలమ్మి, సుపారీ ఇచ్చి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త హత్య చేయించిన భార్య..

బీహార్లోని గయ నగర పోలీసులకు నవంబర్ 23న ముహమ్మద్ తయ్యబ్‌ అనే వ్యక్తి  శవం దొరికింది. మృతుడిని ఎవరో తుపాకులతో కాల్చి చంపారు. పోలీసులు  ఈ హత్య కేసులో విచారణ ప్రారంభించారు. ముందుగా నగరంలోని సుపారీ కిల్లర్స్‌ను పట్టుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు ఈ హత్యకు సంబంధించిన కీలకమైన సమాచారం అందించారు. దాన్ని బట్టి పోలీసులు  సులువుగా ఈ హత్య కేసును ఛేదించారు.

Extra marital affair : wife murdered husband in bihar with the help of lover
Author
Hyderabad, First Published Dec 7, 2021, 11:21 AM IST

బీహార్ : వారిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు.. వారంతట వారే ఒకరంటే ఒకరు ఇష్టపడి..ప్రేమించి.. పెద్దల్ని ఒప్పించి చేసుకున్న పెళ్లి.. వారి ప్రేమకు, అన్యోన్యతకు గుర్తుగా ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు కూడా ఉన్నారు. కానీ అంతలోనే వారి మధ్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఎంతగానో ప్రేమించిన భర్తనే అతి కిరాతకంగా చంపించేలా చేసింది. షాకింగ్ గా ఉన్న ఈ ఘటన బీహార్ లో జరిగింది.

love marriage చేసుకున్న ఒక మహిళ మరో ప్రేమికుడి మోజులో పడింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆమె ప్రియుడి వద్దకు వెళ్లాలంటే భర్త అడ్డుగా ఉండడంతో దారుణానికి పాల్పడింది. తన Jewelry అమ్మిన డబ్బుతో ఆమె భర్తను చంపడానికి Supari ఇచ్చింది. ఈ ఘటన State of Biharలోని గయా నగరంలో జరిగింది.

బీహార్లోని గయ నగర పోలీసులకు నవంబర్ 23న ముహమ్మద్ తయ్యబ్‌ అనే వ్యక్తి  శవం దొరికింది. మృతుడిని ఎవరో తుపాకులతో కాల్చి చంపారు. పోలీసులు  ఈ హత్య కేసులో విచారణ ప్రారంభించారు. ముందుగా నగరంలోని Supari Killers‌ను పట్టుకుని ప్రశ్నించారు. వారిలో ఇద్దరు ఈ హత్యకు సంబంధించిన కీలకమైన సమాచారం అందించారు. దాన్ని బట్టి పోలీసులు  సులువుగా ఈ Murder caseను ఛేదించారు.

టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ లో శిశువు మృతదేహం.. పెళ్లి కాకుండానే తల్లైన ఓ యువతి ఘాతుకం...

పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన ఆయోషా పర్వీన్ 12 ఏళ్ల క్రితం అదే నగరంలో నివసించే Muhammad Tayyab ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది.  వారిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో Ayosha Parveenమరో యువకుడితో loveలో పడింది. అతను మంచి ఉద్యోగం చేస్తుండడంతో భర్త చేస్తున్న ఉద్యోగం, భర్త ఆమెకు నామోషీగా కనిపించడం మొదలయ్యింది.

ఒక సాధారణ ఉద్యోగం చేసే ముహమ్మద్ తయ్యబ్‌ తో ఆమె తన జీవితం కొనసాగించడం కష్టంగా భావించింది. తను ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోవాలనుకుంది. కానీ సమాజం భయంతో అలా చేయడానికి భయపడింది. అయితే భర్త చనిపోతే.. ఆ సమాజం ఏమీ అనదనుకుంది. అందుకే ముందు అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనుకుంది. 

అందుకు ఆమె ప్రియుడి సహాయంతో కొందరు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చింది. తన భర్తను హత్య చేసేందుకు వారికి డబ్బులు ఇవ్వడానికి  ఆయేషా దగ్గర అంత సొమ్ము లేదు. అందుకే తన నగలు తాకట్టు పెట్టింది. ఆ వచ్చిన డబ్బులతో  ఆ కిరాయి హంతకులకు డబ్బు చెల్లించింది.  మరుసటి రోజు ఉద్యోగం కోసం బయటికి వెళ్లిన తయ్యబ్ ను కొందరు దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.

 హత్యా నేరంలో అనుమానితులుగా కొందరు కిరాయి హంతకులను పోలీసులు విచారణ చేయగా.. వారు ఈ హత్య మృతుడి భార్య చెప్పడంతోనే చేశామని అంగీకరించారు. దీంతో పోలీసులు ఆయోషా పర్వీన్, ఆమె ప్రియుడిపై హత్య నేరం మోపి అరెస్టు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios