Pinaka rocket system: పినాక రాకేట్ వ్యవస్థ ఎక్స్ టెండెడ్ రేంజ్ ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. రాజస్థాన్ లోని పోక్రాన్ ఏరియాలో గత మూడు రోజులుగా దశల వారీగా పరీక్షలు నిర్వహించారు. డీఆర్డీవో, సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రయోగాల్లో భాగంగా గత మూడు రోజులుగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
Pinaka rocket system: సైన్యం బలోపేతం దిశగా ఇండియన్ ఆర్మీ మరో ముందడుగు పడింది. దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్ లాంచర్ అభివృద్ధి చేసింది. ఈ లాంచర్ విస్తరణ శ్రేణికి చెందిన పినాక- ఈ ఆర్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థ వివిధ దశ ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. శనివారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ రేంజ్‌లో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO), ఆర్మీ సంయుక్తంగా చేసిన శ్రేణి పినాకా (పినాకా-ఈఆర్) మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్‌ను విజయవంతంగా పరీక్షించింది.
DRDO లేబొరేటరీ ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE), పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (HEMRL)తో కలిసి పినాకా (పినాకా-ఈఆర్) మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ Pinaka – ER ను రూపొందించాయి. Pinaka – ER అనేది గత దశాబ్ద కాలంగా భారత సైన్యంతో సేవలో ఉన్న పినాకా మునుపటి వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ అని డీఆర్డీవో తెలిపింది.
ప్రయోగాల్లో భాగంగా గత మూడు రోజులుగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 రాకెట్లను ప్రయోగించినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు, అన్ని ప్రయోగాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు అందించినట్టు అధికారులు వెల్లడించారు. పినాక-ఈఆర్ అనేది గత దశాబ్ద కాలంగా భారత సైన్యంతో సేవలో ఉన్న పినాకా మునుపటి వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ అని డీఆర్డీవో తెలిపింది.
కొత్తగా ఉద్భవిస్తున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో (Pinaka – ER) ని రూపొందించినట్లు డీఆర్డీఓ తెలిపింది. ప్రభుత్వ- ప్రైవేటు కంపెనీల సహాయంతో అభివృద్ది చేసినట్టు తెలిపింది. పినాకా ఎంకే-ఐ రాకెట్ వ్యవస్థ సుమారు 40 కిలోమీటర్ల దూరాలను సక్సెస్ పుల్ గా నాశనం చేయగలదు. అలాగే పినాకా-2 వేరియంట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను రీచ్ కాగలదు. ఇక పినాకా-ఈఆర్ రేంజ్‌ను మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే వివిధ రేంజ్‌ల్లో ఉన్న టార్గెట్లపై 24 రాకెట్లను పరీక్షించినట్లు మాత్రమే తెలిపారు.
