లాక్‌డౌన్‌ను పొడిగించండి.. కేజ్రీవాల్‌కు ఢిల్లీ వాసుల డిమాండ్, సర్వేలో ఆసక్తికర విషయాలు

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. కానీ ప్రజల నుంచి లాక్‌డౌన్ పెట్టాల్సిందేనన్న డిమాండ్ వస్తోంది

Extend Delhi COVID 19 lockdown by another week Traders body urges CM Arvind Kejriwal ksp

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం మాత్రం సిద్ధంగా లేదు. కానీ ప్రజల నుంచి లాక్‌డౌన్ పెట్టాల్సిందేనన్న డిమాండ్ వస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో కనీసం మరో వారమైనా లాక్‌డౌన్ పొడిగించాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. లోకల్ సర్కిల్స్‌ అనే కమ్యూనిటీ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం నిర్వహించిన సర్వేలో ప్రజలు ఈ మేరకు డిమాండ్ చేశారు.

ఈ సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది ఢిల్లీలో మరో రెండు వారాలు లాక్‌డౌన్ పొడిగించాలని సీఎం కేజ్రీవాల్‌ను కోరగా, 68 శాతం మంది కనీసం మరో వారం రోజులైనా లాక్‌డౌన్ పొడిగించాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని 11 జిల్లాల్లో 8,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

Also Read:ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఆపితే ఉరిశిక్ష: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు

ఢిల్లీ వ్యాపారులతో కూడిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) సైతం కరోనా అదుపులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా తాజా గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని కేజ్రీవాల్‌కు సీఏఐటీ లేఖ కూడా రాసింది. 

కాగా, రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా 6 రోజుల పాటు ఢిల్లీ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. ఈనెల 19న అమల్లోకి వచ్చిన ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 26వ తేదీ తెల్లవారుజామున 5 గంటలతో ముగియనుంది. లాక్‌డౌన్ ప్రకటన సమయంలో రాష్ట్ర పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. వలస కార్మికులను ఢిల్లీ విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

వారికి అన్ని విధాలా అండగా వుంటామని హామీ ఇస్తూనే, మరోసారి లాక్‌డౌన్ పొడిగించేది సీఎం స్పష్టం చేశారు. తాజాగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపుపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios