పాట్నా సివిల్ కోర్టులో శుక్రవారం బ్లాస్ట్ జరిగింది. ఓ కేసు విషయంలో బాంబును తీసుకొచ్చి ఆవరణ ఉంచిన సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఇది చాలా తక్కువ స్థాయిలో సంభవించడంతో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. 

బీహార్ రాష్ట్రంలోని పాట్నా సివిల్ కోర్టులో శుక్రవారం పేలువు సంభ‌వించింది. ఈ పేలుడు తక్కువ తీవ్ర‌తతో జ‌ర‌గ‌డంతో పెద్ద‌గా న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌లేదు. అయితే ఒక కానిస్టేబుల్ కు మాత్రం గాయాలు అయ్యాయి. ఈ పేలుడు ఘ‌ట‌న సంభ‌వించిన వెంట‌నే కోర్టు ప్రాంగ‌ణంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దీంతో పోలీసులు హుటా హుటిన అక్క‌డికి చేరుకున్నారు. ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 

మరో ఆకర్షణీయమైన పథకం అమల్లోకి.. నెలకు 300 యూనిట్లు ఫ్రీ కరెంట్ : పంజాబ్ సీఎం

కొద్ది రోజుల క్రితం పాట్నా యూనివర్సిటీలోని పటేల్ హాస్టల్‌లో గన్‌పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పిర్బహోర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సబీ ఉల్ హక్ తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆవ‌ర‌ణ‌కు తీసుకొచ్చిన బాంబు ఒక్క సారిగా పేలిపోయింది. దీని ప్ర‌భావం త‌క్కువ స్థాయిలో ఉండ‌టంతో పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది. 

Scroll to load tweet…

ఈ ఘ‌ట‌న‌లో ఒక కానిస్టేబుల్ కు కుడి చేతికి గాయాలు అయ్యాయ‌ని SSP మానవజిత్ సింగ్ ధిల్లాన్ వార్తా సంస్థ ANIతో తెలిపారు. మిగితా వారికి గాయాలు కాలేద‌ని చెప్పారు.గాయపడిన కానిస్టేబుల్‌ను వెంటనే వైద్య చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.