ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం సంభవించిన భారీ పేలుడులో బాల్ఖ్ ప్రావిన్స్ తాలిబాన్ గవర్నర్ మొహమ్మద్ దావూద్ ముజమ్మిల్ మరణించాడు. అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఈ పేలుడులో చనిపోయారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో గురవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో బాల్ఖ్ ప్రావిన్స్‌కు చెందిన తాలిబాన్ గవర్నర్ చనిపోయారు. మరో ఇద్దరు కూడా మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించినట్టు వార్తా సంస్థ ‘ఏఎఫ్ పీ’ తెలిపింది. ‘‘ ఈ ఉదయం జరిగిన పేలుడులో బాల్ఖ్ గవర్నర్ మొహమ్మద్ దావూద్ ముజమ్మిల్‌తో పాటు ఇద్దరు వ్యక్తులు మరణించారు’’ అని ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి అసిఫ్ వజీరి ఏఎఫ్ పీకి తెలిపారు.
సిసోడియా ఒక క్రిమినల్.. ఆయన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయండి : ఎలాన్ మస్క్ కు ఢిల్లీ బీజేపీ విజ్ఞప్తి
అయితే ఈ పేలుడుకు కారణమేమిటో స్పష్టంగా తెలియరాలేదని ఆయన అన్నారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గవర్నర్ ఇంటి నుంచి తన ఆఫీసుకు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. “గవర్నర్ తన కార్యాలయానికి వచ్చిన తరువాత ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గవర్నర్‌తో పాటు మరో ఇద్దరు వీర మరణం పొందారు. మరో పౌరుడు కూడా గాయపడ్డారు’’ అని అధికారులు డాన్.కామ్ కు తెలిపారు.
మహిళా జడ్జీకే వేధింపులు.. ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ. 20 లక్షలు డిమాండ్
అయితే ఈ దాడికి ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించలేదు. చాలా కాలం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ పాలకులు, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు మధ్య రక్తపాత వివాదం కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన అన్ని బాంబు పేలుళ్లకు ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. అయితే ఆగస్ట్ 2021లో గ్రూప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి పరిస్థితుల్లో మరణించిన అత్యున్నత స్థాయి తాలిబాన్ అధికారులలో ముజమ్మిల్ ఒకరు.
సొంత పార్టీ నేతను జైల్లో పెట్టించారు.. వాళ్లకు మద్ధతిస్తారా : శరద్‌పవార్‌పై ఒవైసీ ఆగ్రహం
ఆయన మొదట్లో తూర్పు ప్రావిన్స్ ఆఫ్ నంగర్‌హార్‌కు గవర్నర్‌గా నియమితుడయ్యాడు. అక్కడ మొహమ్మద్ దావూద్ ముజమ్మిల్ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటానికి నాయకత్వం వహించారు. అయితే గతేడాది ఆయన బాల్ఖ్‌కు బదిలీ అయ్యాడు.
