దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. 7 దశల్లో జరిగిన ఎన్నికలు నేటితో ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలని వివిధ సంస్థలు వెల్లడించడం ప్రారంభిస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సంస్థ కర్ణాటకలో ఫలితం ఎలా ఉండబోతోందో తన సర్వే ద్వారా వివరించింది. కర్ణాటకలో బిజెపి అత్యధికంగా 21 నుంచి 25 స్థానాలు గెలుచుకోనున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలు ఉన్నాయి. 

బిజెపి 49 % ఓట్ షేర్ సాధించినట్లు ఇండియా టుడే సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ సర్వే ప్రకారం బిజెపి, కాంగ్రెస్ పార్టీలో ఈ విధంగా సీట్లని గెలుచుకోనున్నాయి. 

కర్ణాటక( 28)  

బిజెపి : 21-25

కాంగ్రెస్ : 3-6

ఇతరులు : 0-1