ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి

First Published 11, Jun 2018, 2:49 PM IST
ex pm vajpayee hospitalized
Highlights

ఎయిమ్స్‌లో చేరిన వాజ్‌పేయి

బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని అట్ బిహారీ వాజ్‌పేయయ్ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు స్వస్తి పలికి ఇంటికే పరిమితమయ్యారు.. కాగా, సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగానే వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.. ఇవాళ ఆయనకు డా.రణ్‌దీప్ గులేరియా ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు.. గత మూడు దశాబ్ధాలుగా డా. గులేరియానే వాజ్‌‌పేయికి వ్యక్తిగత వైద్యుడిగా వ్యవహరిస్తున్నారు.. 

 

మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ ఎయిమ్స్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎయిమ్స్ కు వెళ్ళి వాజ్‌పేయ్ ను పరామర్శించారు. వాజ్‌పేయ్ పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడ ఎయిమ్స్ కు చేరుకొని  పరిస్థితిని సమీక్షించారు. వాజ్‌పేయ్ కు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు.

loader