అవినీతి ఆరోపణలతో జైలు జీవితం గడుపుతున్న మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నాయకుడు అనిల్ దేశ్ ముఖ్ కు బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయన మరో పది రోజుల వరకు జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం కనిపించడం లేదు. 

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ కు బాంబే హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి సీబీఐ సమయం కోరిన నేపథ్యంలో హైకోర్టు పది రోజుల పాటు ఉత్తర్వులను నిలిపివేసింది. దీంతో ఆయన ఇప్పుడే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు.

గుజరాత్ కొత్త ఎమ్మెల్యేలలో 40 మందిపై క్రిమినల్ కేసులు - ఏడీఆర్ నివేదిక

విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఎంఎస్ కార్నిక్ సింగిల్ బెంచ్ దేశ్ ముఖ్ కు బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దేశ్ ముఖ్ గత నెలలో బెయిల్ పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలతో పాటు తనకు బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. 30మంది నర్సింగ్ విద్యార్థులకు గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం...

గతేడాదిలో మనీలాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆయనను అరెస్టు చేసింది. నవంబర్ నెల నుంచి దేశ్ ముఖ్ జైలులో గడుపుతున్నాడు. ఈడీ కేసులో ఆయనకు గత నెలలో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే అవినీతి కేసులో దేశ్ ముఖ్ బెయిల్ పిటిషన్ ను సీబీఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

Scroll to load tweet…

ముంబైలోని రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు రూ .100 కోట్లు వసూలు చేయాలని అప్పటి హోంమంత్రి దేశ్ ముఖ్ పోలీసు అధికారులకు టార్గెట్ ఇచ్చారని 2021 మార్చిలో ఐపీఎస్ అధికారి పరమ్బీర్ సింగ్ ఆరోపించారు. దీంతో దేశ్ ముఖ్ పై ప్రాథమిక విచారణ జరపాలని 2021 ఏప్రిల్ లో హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై సీబీఐ దేశ్ ముఖ్, అతడి సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.