ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్,మాజీ ప్రియుడికి షాకిచ్చిన మహిళా టెక్కీ

Ex-lover asks Rs 5 lakh from techie, threatens to leak their videos
Highlights

ప్రియుడికి షాకిచ్చిన మాజీ లవర్


బెంగుళూరు:ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను తీసిన ప్రియుడు  ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తాను అడిగినన్నీ డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. అయితే ప్రియుడి ఖాతాకు రూ. 50 వేలు ట్రాన్స్‌ఫర్ చేసింది. అయినా వేధింపులు ఆగలేదు. దీంతో  ఆమె పోలీసులను ఆశ్రయించింది.

బెంగుళూరు నగరానికి చెందిన  కేఎం  మురుగేష్ అనే యువకుడు 24 ఏళ్ల సాప్ట్ వేర్ ఇంజినీరు అయిన యువతిని ప్రేమించాడు. ఎనిమిదేళ్లుగా సాగిన వారి ప్రేమాయణంలో ప్రియుడి ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ ప్రియురాలు అతన్ని దూరం పెట్టింది. దీంతో ఆమెను తన దారిలోకి తెచ్చుకొనేందుకుగాను ప్రియుడు బ్లాక్ మెయిల్ ను అస్త్రంగా ఎంచుకొన్నాడు.

తన మాజీ లవర్ తో  తాను దిగిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో  అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. అలా చేయకుండా ఉండాలంటే తనకు రూ. 5 లక్షలు ఇవ్వాలని బెదిరించాడు. అయితే ఈ డిమాండ్ మేరకు ఆమె రూ.50వేలను మాజీ ప్రియుడి ఖాతాకు బదిలీ చేసింది. 

జూన్ 17వ తేదిలోపుగా మిగిలిన డబ్బులు ఇవ్వకపోతే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులు మరీ  తీవ్రమమయ్యాయి. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బెంగుళూరు పోలీసులు ఐటీ మురుగేష్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

loader