ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు ఆరు వారాల పాటు బెయిల్..
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టు ఆరువారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. ఆయన అనారోగ్యం, వైద్య కారణాలను పరిశీలించి ఆయనకు బెయిల్ ఇచ్చింది.

జైలులో ఉన్న ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. జైలులోని వాష్ రూమ్ లో జారిపడటంతో అధికారులు ఆయనను గురువారం నగరంలోని ఎల్ఎన్ జేపీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు ఆయనను ఐసీయూ వార్డుకు తరలించి ఆక్సిజన్ సపోర్ట్ పై ఉంచారు. అయితే ఆయన చికిత్స పొందేందుకు వీలుగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ వేడుక.. రూ.75 స్మారక నాణెం విడుదల చేయనున్న కేంద్రం
మనీలాండరింగ్ కేసులో గత ఏడాది మేలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినప్పటి నుంచి ఆప్ నేత జైలులోనే ఉన్నా410రు. అప్పటి నుంచి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటూనే వస్తున్నప్పటికీ మంజూరు కాలేదు. అయినప్పటికీ ఆయన తన మంత్రి పదవిని వదులుకోలేదు. అయితే లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా అరెస్టు అయిన సిసోడియాతో కలిసి ఈ ఏడాది జనవరిలో జైన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
కాగా.. జైన్ ఆరోగ్యం, హోం, పట్టణాభివృద్ధి సహా పలు శాఖలను నిర్వహించేవారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇదిలా ఉండగా.. తన రాజకీయ ప్రయోజనాల కోసం జైన్ ను బీజేపీ వేధిస్తోందని ఆప్ విమర్శించింది. జైలులో ఉన్న సమయంలో బలహీనంగా మారిన జైన్ ఫొటోలను ఆప్ షేర్ చేసింది.
తీహార్ జైలులో జైన్ 35 కిలోల బరువు తగ్గారని పేర్కొంది. వెన్నెముక గాయం, కటి నొప్పి, వెర్టిగో, స్లిప్ డిస్క్ మరియు కండరాల క్షీణత కారణంగా దీర్ఘకాలిక వెన్నునొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసిందని ఆప్ తెలిపింది. బీజేపీ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ అహంకారం, దౌర్జన్యాలను ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘‘దేవుడు కూడా ఈ పీడకులను క్షమించడు. ఈ పోరాటంలో ప్రజలు మన వెంటే ఉన్నారు. భగవంతుడు మన వెంటే ఉన్నారు. మేము భగత్ సింగ్ అనుచరులం, అణచివేత, అన్యాయం, నియంతృత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు.