Asianet News TeluguAsianet News Telugu

కిడ్నాప్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్‌ అరెస్టు..

భారత అండర్-19 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ జోల్ ను కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు అతడి సోదరుడు, మరో 18 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విజయ్ జోల్ 2014 అండర్‌-19 టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యారు.

Ex captain of Team India arrested in kidnapping case
Author
First Published Jan 20, 2023, 8:49 AM IST

కిడ్నాప్ కేసులో భారత అండర్-19 క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విజయ్ జోల్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడితో పాటు సోదరుడు విక్రమ్ జోల్ మరో 18 మందిపై కూడా కిడ్నాప్, దోపిడీ బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఈ అరెస్టులు జరిగాయి. 

వార్నీ.. ఇదో నయాదందా.. డబ్బులకోసం అండాలను అమ్ముకుని.. భర్త అడిగితే..

కాగా.. వీరిపై ఫిర్యాదు చేసిన  క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ పై ఈ 20 మంది నిందితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్టుబడి పేరు చెప్పి తమను ఆ మేనేజర్ లక్షల రూపాయిలు మోసం చేశాడని అందులో పేర్కొన్నాడు. దీంతో అతడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు.

ఇన్విజిలేటర్ తో గొడవ.. పరీక్ష జరుగుతుండగా కత్తితో పొడిచిన విద్యార్థి..

ఈ విషయంలో మహారాష్ట్రలోని జాల్నా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ షిండే ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడారు. “మేము ఇరుపక్షాల నుంచి ఫిర్యాదులు స్వీకరించాం. 2 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసాము. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అన్ని ఆరోపణలను మేము నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నాం. తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం.’’అని పేర్కొన్నారు. 

గూగుల్ కు చుక్కెదురు.. రూ. 1,337 కోట్ల పెనాల్టీ.. 'సుప్రీం'లో పిటిషన్ తిరస్కరణ.. వారం రోజుల్లో..

అసలేం జరిగిందంటే ? 
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విజయ్ సోల్, సోదరుడు విక్రమ్ లు కలిసి పలువురు వ్యక్తులతో కలిసి పూణె వెళ్లారని, అక్కడ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ ఇంట్లోకి ప్రవేశించారని, తరువాత అతడిని ఔరంగాబాద్ సిటీలోని  ఓ హోటల్‌లో పది రోజుల పాటు బంధించారని ఆరోపణలు ఉన్నాయి. తర్వాత జల్నాలోని తమ ఇంటికి తీసుకెళ్లి అక్కడ బంధించారు. అయితే దీనిపై విజయ్ జోల్ ఇంకా స్పందించలేదని ‘హిందుస్థాన్  న్యూస్ హబ్’ నివేదించింది. కాగా.. విజయ్ జోల్ ప్రస్తుత వయస్సు 28 ఏళ్లు. ఆయన 2014లో అండర్‌-19 టీమ్‌ ఇండియా కెప్టెన్‌గా ఎంపికయ్యారు. తరువాత ఐపీఎల్స్ లో మహారాష్ట్ర, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్ లకు బాధ్యత వహించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios