Asianet News TeluguAsianet News Telugu

వార్నీ.. ఇదో నయాదందా.. డబ్బులకోసం అండాలను అమ్ముకుని.. భర్త అడిగితే..

ఓ మహిళ తన విలాసాల కొరకు భర్తకు తెలియకుండా అండాలను అమ్ముకుంటోంది. ఈ విషయం తెలిసి భర్త నిలదీయడంతో చంపేస్తానని బెదిరించింది. 

woman Selling her own eggs for money in gujarat - bsb
Author
First Published Jan 20, 2023, 8:42 AM IST

గుజరాత్ : నేరాల జాబితాలోకి కొత్త రకాల నేరాలు చేరుతున్నాయి.  తాజాగా ఇటీవల బాగా పాపులర్ అవుతున్న అండాల విక్రయం చుట్టూ అల్లుకున్న ఓ నేరం వెలుగుచూసింది. ఓ మహిళ తన విలాసాల కోసం అండాలను అమ్ముకుంది. ఈ విషయం భర్తకు తెలవడంతో ఆమెను నిలదీశాడు. అయితే  తప్పు చేసి దొరికిపోయిన ఆమె ఎదురు తిరిగింది. భర్తను చంపేస్తానని భర్తను బెదిరించింది. గుజరాత్లో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. అక్కడి అమ్రైవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..  అనిత అనే మహిళకు ఐదేళ్ల క్రితం వివాహమయ్యింది. పెళ్లైన రోజు నుంచి అత్తమామలతో ఆమెకు తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో వేరు కాపురం పెడదామని భర్త మీద ఒత్తిడి తెచ్చింది. దీంతో  తల్లిదండ్రులకు దూరంగా ఓ అద్దెకి తీసుకొని వేరు కాపురం పెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత భర్త ఆదాయం సరిపోవడం లేదని రోజూ గొడవ పెట్టుకునేది. దీంతో భర్త విసిగిపోయాడు.ఎంత చెప్పినా వినని భార్యను వదిలేసి 2019లో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయాడు.

ఇన్విజిలేటర్ తో గొడవ.. పరీక్ష జరుగుతుండగా కత్తితో పొడిచిన విద్యార్థి..

ఆమె తన పుట్టింటికి చేరింది. ఆ తర్వాత ఇరు కుటుంబాలు జోక్యం చేసుకొని వీరిద్దరి మధ్య రాజీ కుదిరించారు. దీంతో కొద్దిరోజులుగా వేరు కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఆరా తీయగా డబ్బుల కోసం అనిత తన అండాలను  అమ్ముకుంటుందన్న సంగతి తెలిసింది. దీనికోసం అనిత తల్లి కూడా సహకరిస్తున్నట్లు  తెలుసుకున్నాడు. వీరిద్దరూ కలిసి అహ్మదాబాద్ లోని ఓ ఏజెంట్ సహాయంతో ఈ పనికి  పాల్పడుతున్నారని గుర్తించాడు.

దీంతో భార్యను నిలదీశాడు. భర్తకు విషయం తెలిసిపోవడంతో  ఆమె  పెద్ద గొడవ చేసింది. అతనికి తెలిసిన ఆ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించింది. చెబితే చంపేస్తానని  హెచ్చరించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనిత తన ఆధార్ కార్డులో డేట్ అఫ్ బర్త్ ను మార్చుకొని అండాలను అమ్ముకుంటున్నట్లుగా  ఫిర్యాదులో తెలిపాడు. అంతేకాదు  భర్త అనుమతితోనే వాటిని అమ్ముకుంటున్నట్లుగా ఫోర్జరీ పత్రాలు సృష్టించిందని.. తనకు ఆ విషయం ఏమీ తెలియదని పేర్కొన్నాడు. 2019 జనవరి నుంచి 2022  జూన్ మధ్యకాలంలో అనేకసార్లు  అనిత తన అండాలను  అమ్ముకుందని వాపోయాడు. దీంతో పోలీసులు అనిత మీద ఫోర్జరీతో పాటు అక్రమంగా అండాల విక్రయం సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios