రంజాన్ మర్యాదలను ఎవ్వరూ పట్టించుకోరు.. ఇఫ్తార్ అనేది పార్టీ కాదు..  గెట్-టుగెదర్‌ అసలు కాదు.. 

రంజాన్, రోజాలు , ఇఫ్తార్ లేదా  సెహేరీల సమయంలో మర్యాదలు, సరైన ప్రవర్తన గురించి ఇతరులకు అంతగా తెలియకపోవడం ఎవరి తప్పు ? ఇఫ్తార్  ఎప్పుడూ పార్టీ కాదు, దేవుని యందు భక్తి

Etiquettes of Ramzan that not many Indians care to know about KRJ

ఇది రంజాన్ మాసం.. ముస్లింలందరూ ఉపవాస దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలతో మునిగిపోతారు.ఈ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అనవాయితీ. అలాగే.. నేను కూడా ఆచారాలను పాటిస్తాను. నా 17 గంటల  రోజా  (ఉపవాసం) విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఆకలి, దాహం, తలనొప్పి భరించగల శక్తినిచ్చినందుకు అల్లాకు కృతజ్ఞతలు. శారీరక బలహీనంగా ఉండే నేను.. నెల రోజుల ఉపవాసంతో నా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా మారింది. (14 నుండి 16 గంటల 28 రోజుల పాటు ఉపవాసం ఉండటం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను ఆపవచ్చని నిరూపించినందుకు గాను యోషినోమోరి ఓషుమ్ అనే జపనీస్ సెల్ బయాలజిస్ట్‌కు 2016 సంవత్సరానికి నోబెల్ బహుమతి లభించింది).

నేను ఉపవాస దీక్షను మొదటి  ఖజూర్ తో ముగిస్తాను. ఖజూరను నా నోటిలో పెట్టే ముందు.. అల్లా..నేను మీ కోసం ఉపవాసం ఉంచాను. ఇప్పుడు ఆ ఉపవాసాన్ని విడుస్తున్నాను. మీ దీవెనలు మా మీద ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తాను. ఈ సమయంలో ఓ వ్యక్తి సడెన్ గా ఫోన్ చేశారు. దీంతో హడావిడిగా కొంచెం నీరు త్రాగుతున్నాను. ఉపవాసం ముగిసే సమయానికి దాహం తీరదు. ఎదురుగా ఉన్న వ్యక్తి 'లగ్జరీ ఆఫ్ టైమ్' మోడ్‌లో ఉన్నాడు. ఏం చేస్తున్నారు. నేను ఖాళీగా ఉన్నాను.  కాబట్టి నేను మీకు ఫోన్ చేసి చిట్-చాట్ చేస్తానని అనుకున్నాను ” అన్నారు. 

"నిజంగా!" నేనే అనుకుంటున్నాను! ఈ సమయంలో ముస్లింలు ఏం చేస్తారో వారికి తెలియదా? 16 నుండి 18 గంటల ఉపవాసం తర్వాత ఉపవాసం విడిచిపెడుతారనే ఆ వ్యక్తి  ఆలోచనలో లేదా? ఆయనకు రంజాన్ , రోజాల మర్యాదలు   అస్సలు తెలియదా? నేను అతనికి ఏమి చెప్పగలను? అనుకున్నాను. ఇది కేవలం వ్యక్తిగత కాల్ లే కావచ్చోచు. మీడియా, పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌లు, కాల్ సెంటర్‌లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇన్‌స్టిట్యూట్‌లు, ఎడ్యుకేషన్ హౌస్‌లు మొదలైన వారి నుండి వృత్తిపరమైన కాల్‌లు రావడం సాధారణం. కానీ రంజాన్ మాసంలో ఈ సమయంలో ముస్లింలకు ఫోన్ చేసే ముందు కొన్ని గుర్తుకుంచుకోవాలనేది నా భావన. 
 
దయ, క్షమాపణతో అల్లాపై మనస్సు పెట్టాల్సిన మాసం కాబట్టి నేను ఆ వ్యక్తిపై కోపం తెచ్చుకోకూడదు, కానీ నేను కోపంగా ఉన్నాను. అందుకే ఇలా ప్రతిస్పందిస్తున్నాను. “నా పేరు నేను ముసల్మాన్ అని, నేను సరిగ్గా ఆ సమయంలో నా రోజాను విడుస్తాననీ తెలుసు. ఆ సమయంలో అనవసరంగా ఫోన్ ఎలా చేస్తారు?. నాకు  50 ఏళ్లు.. అయినా.. నేను పవిత్ర మాసాన్ని పవిత్రంగా పాటిస్తాను. ఫోన్‌లో అవతలి వైపు ఉన్న వ్యక్తిని తప్పు పట్టడం సరికాదు. ఆ సమయంలో ఇబ్బంది పడ్డాను. ప్రస్తుతం  రొటీన్ రెస్పాన్స్, భావోద్వేగాలు లేవు, పశ్చాత్తాపం లేదు, బాధ్యత లేదు. ఇఫ్తార్ సమయంలో ముస్లింలు పాటించే నియమాల గురించి వారికి చెప్పడం లేదా కాల్‌లను అస్సలు తీసుకోకుండా ఉండాలి. అయినా.. పదే పదే ప్రజలకు చెప్పి ఫలించలేదు.
 
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. పవిత్ర మాసంలో ముస్లింలతో సంభాషించే నియమాలను నేర్చుకోవడానికి మన దేశంలో ఎందుకు ఇష్టపడరు? చాలా మంది లేదా వారి ముస్లిం స్నేహితులు అస్సలు ఉపవాసం ఉండకపోవడమే దీనికి కారణం. లేదా రంజాన్ ఉపవాసాల గురించి సరిగా చెప్పేవారు లేకపోవడం కూడా మరో కారణం కావచ్చు లేదా ఎవరైనా వాటి గురించి చెప్పిన మనస్సు వరకు రాకపోవచ్చు వల్లనా? వారి  ముసల్మాన్  స్నేహితులు, ఇరుగుపొరుగువారు, ఉపాధ్యాయులు లేదా ఇంట్లోని పెద్దలు ఈ విషయం వారికి చెప్పలేదా? వారికి ద్రుష్టిలో రంజాన్ ఉపవాసం అంటే..  విందు మాత్రమేనా? 
 
దురదృష్టవశాత్తూ.. చాలా ఇఫ్తార్ 'పార్టీలు' కేవలం ముసల్మాన్‌గా హోస్ట్‌గా ఉంటాయి.  కొందరు సంఘీభావాన్ని తెలియజేయడానికి ఉపవాసాలు కూడా చేస్తారు. నేను అలీఘర్‌లో ఒక ముస్లిమేతర స్నేహితుడి ఇఫ్తార్ 'పార్టీ'కి కూడా హాజరయ్యాను , అందులో చాలా మంది అతిథులు ముస్లిమేతరులే. ముస్లింలు తరచూ ఇలాంటి ఇఫ్తార్ 'పార్టీలు' నిర్వహిస్తారు. డైనింగ్ టేబుల్‌పై అనేక రకాల ఆహార పదార్థాలు,స్నాక్స్‌లు ఉంటాయి. ఈ సమయంలో కొందరూ మాడ్రన్ డ్రెస్ లో రావడం చూశాను. అతిథులు షార్ట్‌లు, కార్గో ప్యాంట్‌లు మరియు జీన్స్-టీ-షర్టులలో కూడా వచ్చారు. వారికి ముస్లింల డ్రెస్ కోడ్ అతిథులకు చెప్పలేదని పలు సందర్బాల్లో అనిపించింది. 
 
రంజాన్, రోజాలు , ఇఫ్తార్ లేదా  సెహేరీల సమయంలో మర్యాదలు, సరైన ప్రవర్తన గురించి ఇతరులకు అంతగా తెలియకపోవడం ఎవరి తప్పు ? ఇఫ్తార్  ఎప్పుడూ పార్టీ కాదు, దేవుని యందు భక్తి. అదో ప్రార్థన. రోజు ఆకలితోనూ, దాహంతోనూ ఉండడం ద్వారా వచ్చే సర్వశక్తిమంతుడికి వినయంగా కృతజ్ఞతా సమయమిది. ఇఫ్తార్ అనేది పార్టీ కాదు. గెట్-టుగెదర్‌గా జరపడం సరికాదు.  

నేను నా యుక్తవయస్సులో ఉపవాసం చేయడం ప్రారంభించినప్పటి నుండి.. మా నాన్న క్లయింట్లు, ఆఫీసర్ బేరర్లు లేదా నా తోబుట్టువుల స్నేహితులు ఏదో సంభాషణలో .. లేదా ఇండోర్ గేమ్‌లు ఆడటానికి సాయంత్రం సమయంలో ఇప్తార్ విందుకు ఆహ్వానించారా ? అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. వారికి ఇఫ్తార్, ప్రార్థన సమయం గురించి సరిగా తెలియకపోవడమో .. లేదా ముస్లిమేతర ప్రాంతాలలో, కాస్మోపాలిటన్‌లో ఉండటం కూడా మరో కారణం కావచ్చు.

రంజాన్ వ్యాపారంగా మారింది. ఈ రంజాన్ మాసంలో సాధారణంగా పూర్తి స్వింగ్‌లో జరిగే సాంస్కృతిక సాయంత్రాలు, కళ, థియేటర్, సాహిత్యం, చలనచిత్ర ప్రదర్శనల గురించి కూడా మాట్లాడుకుందాం. నిర్వాహకులు ముస్లింల ఉపవాస మాసం అని పరిగణనలోకి తీసుకోరు. వీరిలో చాలా మంది ప్రదర్శనలలో చేరడానికి ఇష్టపడతారు. తరచుగా ఇటువంటి ప్రదర్శనల సమయాలు ఇఫ్తార్‌తో సమానంగా ఉంటాయి. ఇటీవల.. నేను మేధావులు, సాహిత్యదిగ్గజాలు, చిత్రనిర్మాతల వాట్సాప్ సమూహంలో ఈ అంశాన్ని లేవనెత్తాను. నేను హాజరు కావడానికి ఇష్టపడే ఒక కార్యక్రమానికి ఆహ్వానం అందిందని వారికి చెప్పాను. అయితే.. రంజాన్ మాసంలో నేను నిర్వహించాల్సిన పలు బాధ్యతలు ఉన్నందున.. నేను వెళ్ళలేకపోయాను. రంజాన్‌ మాసంలో ఇలాంటి కార్యక్రమాలను లైట్‌ గా తీసుకోవచ్చా అని అడిగాను. నాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. 

ఒక ప్రసిద్ధ రచయిత "మేము దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, అది మన ఆలోచనలను దాటలేదు" అని ఆయన అంగీకరించగా, మరొక వ్యక్తి ఒకరి ప్రాధాన్యతలను నిర్వచించినట్లయితే కొన్ని విషయాలను దాటవేయడం ఫర్వాలేదు, ఇతరులు మౌనంగా ఉండిపోయారు. నాకు కూడా గుర్తుంది. మేము దీపావళి , హోలీకి అనేక సెలవులు పొందుతాము. కానీ  ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉజ్-జుహా కోసం మాత్రమే పరిమితం చేయబడింది. ఒక నెల ఉపవాసంతో కూడిన ముస్లిం పండుగ, పాఠశాలల్లో కొన్ని రోజుల సెలవుదినాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఆందోళన కలిగించే విషయం కాదు.

భారతదేశంలో మతాల మధ్య పరస్పర చర్యల గురించి చర్చించడానికి, మతపరమైన సందర్భాలలో ఆచార శుభాకాంక్షల మార్పిడికి మించి వెళ్లడానికి ఇది సమయం అని నేను భావిస్తున్నాను.  రంజాన్ మాసం ఉపవాసానికి సంబంధించినదని భారతీయులందరూ తప్పక తెలుసుకోవాలి. ఇది 'పార్టీ' కాదు. కబాబ్‌లు, బిర్యానీల గురించి కాకుండా దానధర్మాలు చేయడం గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. రంజాన్ అంటే వివిధ రకాల ఆహార పదార్థాలు తినడం గురించి కాదని గుర్తించాలి. అలాగే.. అత్యవసరమైతే తప్ప ఇఫ్తార్ సమయంలో ఇతరులను పిలవడం తప్పు. ఇది  ఉపవాసాలను గౌరవించే పండుగ.. కాబట్టి తదుపరి సారి రంజాన్ సందర్భంగా దయచేసి మీరు ఇఫ్తార్ సమయంలో ముస్లింలను పిలవకుండా చూసుకోండి . స్థానిక ఇఫ్తార్ సమయాన్ని కనుగొనడానికి Googleతో తనిఖీ చేయవచ్చు.  సహజీవనం, సమకాలీన జీవనం భారతదేశ సంస్కృతిలో భాగం!

రచయిత:  రానా సిద్ధిఖీ సీనియర్ జర్నలిస్ట్, సినీ విమర్శకురాలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios