ప్రముఖ జర్నలిస్ట్ కుల్‌‌దీప్‌నయ్యర్ గురువారం ఉదయం మరణించాడు.  అతని వయస్సు 95 ఏళ్లు.నయ్యర్ మృతిపట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు. 


న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్ కుల్‌‌దీప్‌నయ్యర్ గురువారం ఉదయం మరణించాడు. అతని వయస్సు 95 ఏళ్లు.నయ్యర్ మృతిపట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

1923లో సియాల్‌కోట్‌లో ఆయన జన్మించాడు. 1977లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎమర్జెన్సీని విధించారు.ఈ ఎమర్జెన్సీ విధించిన వెంటనే అరెస్ట్ చేసిన మొదటి జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్.

పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణం ఉండాలని కుల్‌దీప్‌నయ్యర్ కోరుకొనేవాడు. పాకిస్తాన్ అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత కుల్‌దీప్ నయ్యర్ ఆ దేశ న్యూక్లియర్ సైంటిస్ట్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ తో ఇంటర్వ్యూ చేశాడు.

యూకేలో భారత రాయబారిగా కూడ కొంతకాలం కుల్‌దీప్‌నయ్యర్ పనిచేశారు. అంతేకాదు కొంతకాలం పాటు ఆయన రాజ్యసభసభ్యుడిగా కూడ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తదితరులు కుల్‌దీప్ నయ్యర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.