Asianet News TeluguAsianet News Telugu

భాయ్ ఫ్రెండ్ ఉంటేనే క్యాంపస్ లోకి ఎంట్రీ.. ఒడిశా కాలేజీ వింత ప్రకటన.. సోషల్ మీడియాలో నోటీస్ వైరల్

ఫిబ్రవరి 14వ తేదీ వరకు భాయ్ ఫ్రెండ్ ఉంటేనే క్యాంపస్ లోకి అనుమతి ఇస్తామని ఒడిశాలోని ఓ కాలేజీ ప్రకటన విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది నకిలీది అని తరువాత తేలింది. 

Entry into the campus only if you have a brother friend.. Strange announcement of Odisha college.. Notice on social media is viral
Author
First Published Jan 24, 2023, 2:53 PM IST

భాయ్ ఫ్రెండ్ ఉంటేనే అడ్మిషన్ క్యాంపస్ లోకి అనుమతి ఇస్తామని ఓ కాలేజీ చేసిన వింత ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రకటన సోషల్ మీడియా యూజర్లను అయోమయానికి గురి చేసింది. ప్రేమికుల రోజుకు ప్రతీ అమ్మాయికి భాయ్ ఫ్రెండ్ తప్పనిసరిగా ఉండాలని ఆ ప్రకటన పేర్కొంది. ఈ సర్క్యులర్ విడుదలైన కొంత సమయానికే వైరల్‌గా మారింది. అయితే ఈ సర్క్యులర్ నకిలీదని తేలింది.

ఫ్లై ఓవర్ పై నుంచి కట్టల్లో తెచ్చిన డబ్బు వెదజల్లాడు.. అందుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియోలు ఇవే

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్‌లోని ఎస్‌వీఎం అటానమస్ కాలేజీ ఈ ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ నోటీసులో వాలెంటైన్స్ డే నాటికి అమ్మాయిలందరూ బాయ్‌ఫ్రెండ్‌లను పొందాలని పేర్కొంది. భాయ్‌ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలను మాత్రమే క్యాంపస్‌లోకి అనుమతిస్తామని అందులో పేర్కొంది. రిలేషన్ షిప్ స్టేటస్ ను పెంచుకోవాలని విద్యార్థిణులను కోరింది. అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్‌లతో ఇటీవల క్లిక్ చేసిన ఫోటోను చూపించాలని పేర్కొంది. ప్రిన్సిపాల్ సంతకంతో కూడిన ఈ సర్క్యులర్ తక్షణమే వైరల్‌గా మారింది. కానీ అది ఆ ప్రకటన నకిలీది అని తేలింది. అయినప్పటికీ విద్యార్థులు, ఇతర నెటిజన్లు ఈ సర్క్యులర్‌పై కామెంట్లు చేశారు.

“మేమంతా వైరల్ నోటీసును చూశాము. కానీ అది అసలైంది కాదు. ఈ ప్రకటన వల్ల మా కాలేజీకి చెడ్డ పేరు వచ్చింది. మా ప్రిన్సిపల్ మంచి వ్యక్తి. ఆయన అలాంటి ప్రకటన చేసి ఉంటాడని మేము అనుకోవడం లేదు.’’ అపి రష్మితా బెహెరా అనే విద్యార్థిని ‘ఇండియా న్యూస్’తో పేర్కొన్నారు. కాగా..దీనిపై మరో విద్యార్థి స్పందిస్తూ.. ‘‘ఈ నోటీసు కాలేజీ జారీ చేయలేదు. వైరల్ నోటీసు ముద్రించబడిన లెటర్‌హెడ్ నకిలీది. దీనిపై కాలేజీ కాంటాక్ట్ నెంబర్, పేరు సరైన క్రమంలో లేదు’’ అని మరొకరు పేర్కొన్నారు. కాగా.. ఈ వైరల్ పోస్టుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జగత్‌సింగ్‌పూర్‌ ఐఐసీ సుభ్రంశు పరిదా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios