ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.  లక్నో కి చెందిన ప్రశాంత్ సింగ్ (23)  అనే విద్యార్థి గురువారం  పాష్ గోమతీ నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కి వెళ్లాడు. ఆ అపార్ట్ మెంట్ లో తనకు తెలిసిన ఓ వ్యక్తి ఉండటంతో.. కలవడానికి వెళ్లాడు.

అయితే.. అప్టపికే అక్కడ ప్రశాంత్ కోసం దాదాపు పది నుంచి 12మంది యువకులు ఎదురు  చూస్తున్నారు. ప్రశాంత్ రాగానే.. అందరూ కలిసి ఓకేసారి దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలై ప్రశాంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కాగా... ఈ ఘటన మొత్తం స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది.

Also Read అతి శుభ్రత, విసిగి వేసారి భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త...

ఆ వీడియో ప్రకారం దుండగులంతా టయోటా ఇన్నోవా కారులో అక్కడకు చేరుకున్నారు. ముందుగా అక్కడ ఉన్న ఇద్దరు యువకులను కొట్టి అక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రశాంత్ పై ఒకేసారి అందరూ కలిసి దాడి చేశారు. తల, ఛాతిపై కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా.. ప్రశాంత్ ని గమనించిన అపార్ట్ మెంట్ లోని కొందరు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి అతనికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా... ప్రశాంత్ వారణాసికి చెందినవాడు కాగా.. లక్నోలోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు.

అయితే... బుధవారం సాయత్రం ప్రశాంత్  కి కాలేజీలో తన జూనియర్ తో గొడవ జరిగిందని.. ఆ తర్వాత రోజు స్నేహితుడి బర్త్ డే పార్టీ కి వెళ్తుంటే.. దారుణం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాలేజీలో జూనియర్ తో జరిగిన గొడవ వల్లే ప్రశాంత్ ప్రాణాలు పోయాయా అన్న విషయంపై క్లారిటీ లేదు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.