శ్రీనగర్: పోలీసు ఉద్యోగం కోసం ఓ టెర్రరిస్టు ఎంపికయ్యాడు. జమ్మూ కాశ్మీర్  రాష్ట్ర పోలీసు శాఖ  పోలీసు ఉద్యోగాల నియామకం కోసం ఇంటర్వ్యూ చేసే అభ్యర్ధుల జాబితాను తయారు చేసింది.ఈ ఈ ఇంటర్వ్యూకు హజరుకాకుండానే  టెర్రరిస్టు  ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని సొపోర్‌కు చెందిన ఖుర్షీద్‌ అహ్మద్‌ మాలిక్‌ ఇటీవల శ్రీమాతా వైష్ణో దేవి యూనివర్సిటీలో బీటెక్‌ పూర్తి చేశాడు. పోలీస్‌ ఉద్యోగం కోసం జూన్‌లో నిర్వహించిన పరీక్షలో మాలిక్‌  అర్హత సంపాదించాడు.పోలీసు ఉద్యోగం కోసం చివరగా నిర్వహించే  ఇంటర్వ్యూ కోసం పోలీసు శాఖ నిర్వహించతలపెట్టిన జాబితాలో ఖుర్షీద్‌కు చోటు దక్కింది.

అయితే బారాముల్లాలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో అహ్మద్ మృత్యువాత పడ్డాడు.  పోలీసు ఉద్యోగం ఇంటర్వ్యూకు హాజరుకాకుండానే ఎన్‌కౌంటర్‌లో ఆయన మృతి చెందాడు.

కశ్మీర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌కు సన్నద్ధమవుతున్న మాలిక్‌ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత అతడు పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.