ఓ ఇంజనీర్ అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. భార్యను చంపి ఆమె శరీరాన్ని ఏడు ముక్కలుగా కోశాడు.
న్యూఢిల్లీ: ఓ ఇంజనీర్ అత్యంత దారుణమైన సంఘటనకు ఒడిగట్టాడు. భార్యను చంపి ఆమె శరీరాన్ని ఏడు ముక్కలుగా కోశాడు. ఉద్యోగం మారుతున్నందుకు వేధిస్తుందనే ఆగ్రహంతో ఆయన ఈ పనిచేశాడు. ఈ సంఘటన న్యూఢిల్లీలో జరిగింది.
సాజిద్ అలీ అన్సారీ అనే ఇంజనీరుకు 2011లో జుహితో వివాహమైంది. సాజిద్ ఇటీవల తరచుగా ఉద్యోగం మారుతూ వస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అతను భార్యపై కోపం పెంచుకున్నాడు.
ఆ కోపంతో ఆమెను చంపేశాడు. తన ఇద్దరు సోదరుల సహాయంతో ఆమె శవాన్ని ముక్కలుగా కోసి ఓ అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఆగ్నేయ ఢిల్లీలోని సరిత విహార్‌లో పడేశాడు. అనుమానాస్పదంగా ఉండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అట్టపెట్టెపై ఉన్న చిరునామాతో ఓ ప్రైవేటు ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థను విచారించారు. తాము అక్తర్‌కు పంపినట్లు తెలిపింది. అతన్ని విచారించగా తన ఇంట్లో అద్దెకు ఉండే సాజిద్‌కు అట్టపెట్ట ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది.
