Asianet News TeluguAsianet News Telugu

ముంబై ఎయిర్‌పోర్టు నిర్మాణంలో నిధుల దుర్వినియోగం: ఈడీ సోదాలు

ముంబై ఎయిర్ పోర్టు స్కామ్‌ కు సంబంధించి జీవీకేకు చెందిన పలు సంస్థల్లో ఈడీ మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తోంది.

Enforcement directorate raids on gvk firms over mubai airport fraud case
Author
New Delhi, First Published Jul 28, 2020, 11:14 AM IST


న్యూఢీల్లీ: ముంబై ఎయిర్ పోర్టు స్కామ్‌ కు సంబంధించి జీవీకేకు చెందిన పలు సంస్థల్లో ఈడీ మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తోంది.ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం కేటాయించిన రూ. 730 కోట్లను జీవీకే సంస్థ దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి.ఈ విషయమై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

also read:జీవీకె కుంభకోణంలో పింకిరెడ్డి పాత్ర: సీబిఐ ఎఫ్ఐఆర్ లో పేరు

ఈ విషయమై ముంబై, హైద్రాబాద్, బెంగుళూరు, ఢీల్లీతో పాటు మరో ఐదు చోట్ల ఈడీ  అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.ముంబై ఎయిర్ పోర్టు విషయంలో నిధుల దుర్వినియోగం చేశారని సీబీఐ అధికారులు జీవీకేపై కేసు నమోదు చేశారు. 

రూ. 395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్టుగా సీబీఐ గుర్తించింది. ఐశ్యర్యగిరి కన్ స్ట్రక్షన్ కంపెనీ, సుభాష్ ఇన్ ఫ్రా ప్రైవెట్ లిమిటెడ్,ఆక్వాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమిని ఇండియా ప్రాజెక్టు, నైస్ ప్రాజెక్టు లిమిటెడ్, అదితి ఇన్పో బిల్డ్ సర్వీసుల పేర్లతో కంపెనీల ఏర్పాటు చేసినట్టుగా సీబీఐ విచారణలో గుర్తించింది.


తప్పుడు ఇన్ వాయిస్ ల పేరుతో ఈ నిధులను మళ్లించినట్టుగా సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పింకిరెడ్డి డైరెక్టర్ గా ఉన్న ఆర్బిట్ ట్రావెల్స్ కంపెనీకి భారీ మొత్తంలో నిధులను మళ్లించినట్టుగా సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.

ఎయిర్ పోర్టు పక్కనే 200 ఎకరాల్లో అభివృద్ధి పేరుతో నిధులను బదలాయించినట్టుగా గుర్తించారు. మరో వైపు హైద్రాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొన్నట్టుగా సీబీఐ గుర్తించింది. 

ముంబై ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో భారీగా నిధులను దుర్వినియోగం చేసినట్టుగా జీవీకే కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం పింకిరెడ్డి కంపెనీపై కూడ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios