హైదరాబాద్: జీవీకే కుంభకోణంలో  పింకిరెడ్డి పేరును చేర్చింది సీబీఐ. ఆర్బిట్ ట్రావెల్స్ సంస్థకు పింకిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. 

జీవీకే కుంభకోణంలో ఆర్బిట్ ట్రావెల్స్ సంస్థ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ.  ముంబై ఎయిర్ ఫోర్స్ అభివృద్ధి పేరుతో నిధులు మళ్ళించారని జీవీకే సంస్థకు చెందిన జీవీ కృష్ణారెడ్డి, సంజయ్ లపై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది.

also read:జీవీకే గ్రూప్ చైర్మన్, ఆయన కొడుకు పై సిబిఐ కేసు

ఈ కేసు దర్యాప్తులో భాగంగా పింకిరెడ్డి పాత్రను సీబీఐ గుర్తించినట్టుగా తెలుస్తోంది.  ఆర్బిట్ ట్రావెల్స్ సంస్థకు డైరెక్టర్లుగా పింకిరెడ్డి, శ్రేయ భూపాల్, శాలిని భూపాల్ ఉన్నారు. జీవీకేకు చెందిన 9 సంస్థలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 

ముంబై ఎయిర్ పోర్టు నిర్మాణంలో రూ. 705 కోట్లు దుర్వినియోగం చేశారని జీవీకే సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫ్లయిట్ టికెట్స్ బుకింగ్, ట్రావెల్స్ కు ఆర్బిట్  ట్రావెల్స్ తో ఒప్పందం చేసుకొందని సీబీఐ గుర్తు చేసింది. ఆర్బిట్ ట్రావెల్స్ కు  మియల్ ముంబై ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ నిధులను చెల్లించినట్టుగా సీబీఐ దర్యాప్తులో గుర్తించిందని తెలుస్తోంది.