Asianet News TeluguAsianet News Telugu

పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దాడులు‌.. 15 రాష్ట్రాల్లో 100 మందికి పైగా అరెస్ట్‌ 

దేశవ్యాప్తంగా  పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI), దాని అనుబంధ కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీ ఎత్తున దాడులు చేస్తోంది. సుమారు 300 మంది ఎన్‌ఐఏ అధికారులు 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ఇప్పటివరకు 45 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 

PFI raids by NIA, ED: 93 locations, 15 states, 300 officers
Author
First Published Sep 23, 2022, 3:11 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) లేదా పీఎఫ్‌ఐతో అనుబంధమున్న అనుమానిత టెర్రర్-ఫండింగ్ కార్యకలాపాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారీస్థాయిలో దాడులు చేస్తోంది. దాదాపు 300 మంది ఎన్ఐఏ అధికారులు 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి..  పీఎఫ్‌ఐ చైర్మన్‌ ఓఎంఏ సలామ్‌తో సహా మొత్తం 45 మందిని అరెస్టు చేశారు.

ఇంతకుముందు PFIకి సంబంధించిన డజనుకు పైగా కేసులను దర్యాప్తు చేసింది, ఇందులో 355 మంది వ్యక్తులు ఛార్జ్-షీట్ చేయబడ్డారు మరియు 46 మందిని దోషులుగా నిర్ధారించారు.కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో జరుగుతోన్న అతిపెద్ద ఆపరేషన్‌ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) అనే సంస్థ ఎలా రూపుదాల్చింది. దాని కార్యకలాపాలేంటో ఓసారి చూద్దాం..

> 15 రాష్ట్రాల్లో మొత్తం 93 లొకేషన్లలో దాడులు  

కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్, మణిపూర్ సహా 15 రాష్ట్రాల్లోని 93 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ నెల ప్రారంభంలో, ఎన్‌ఐఎ తెలంగాణలో 38, ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రాంతాల్లో దాడులు చేసి డిజిటల్ పరికరాలు, పత్రాలు, ఆయుధాలు, రూ.  8.31 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది.

తాజాగా.. అత్యధికంగా కేరళలో 39 ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. అలాగే.. తమిళనాడులో 16, కర్ణాటకలో 12, ​​ఆంధ్రప్రదేశ్‌లో 7 చోట్ల సోదాలు జరిగాయి. రాజస్థాన్, మహారాష్ట్రల్లో కూడా నాలుగు చోట్ల సోదాలు జరిగాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో రెండు చోట్ల ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌లో ఒక్కో చోట సోదాలు జరిగాయి.

దాదాపు 300 మంది అధికారులతో కూడిన ఈ ఆపరేషన్‌ను NIA డైరెక్టర్ జనరల్ పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఐఏ 5 చోట్ల ఎఫ్ఐఆర్ చేసింది. పీఎఫ్‌ఐ అగ్రనేతలు, సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది ఎన్ఐఏ. ఈ క్రమంలో మొత్తం 45 మందిని అరెస్టు చేశారు. కేరళ లో 19 మంది, తమిళనాడులో 11 మంది,కర్ణాటకలో ఏడుగురిని, ఆంధ్రప్రదేశ్‌ లో నలుగురు, రాజస్థాన్‌ లో ఇద్దరిని, యూపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరిని అరెస్టు చేశారు.

గురువారం అదుపులోకి తీసుకున్న వారిలో పలువురు పీఎఫ్‌ఐ అగ్రనేతలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. ఇంతకుముందు.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియాకి సంబంధించిన కార్యకలాపాల విషయంలో డజనుకు పైగా కేసులు దర్యాప్తు అయ్యాయి. ఇందులో 355 మందిపై చార్జిషీట్ నమోదయ్యాయి. మొత్తం46 మందిని దోషులుగా నిర్ధారించారు. 

పీఎఫ్‌ఐ ఆవిర్భవం 

జాతీయ స్థాయిలో ముస్లిం వర్గంలో సామాజిక,ఆర్థిక,రాజకీయంగా వెనకబడిన వారికి సాధికారత కల్పించేందుకు ఓ వేదికను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో పలు ముస్లిం సంస్థలు ఏకమై.. 2006లో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా గా అవతరించాయి. పీఎఫ్‌ఐగా ఏర్పడిన కొద్ది కాలానికే ఆ సంస్థ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రధానంగా.. మణిపూర్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్‌కు వ్యాపించింది. కేరళ, కర్ణాటక,తమిళనాడులో PFI బలమైన ఉనికిని కలిగి ఉంది.దీనికింద సోషల్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (SDPI), విద్యార్థి విభాగమైన క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ వుమెన్స్‌ ఫ్రంట్‌, రెహబ్‌ ఇండియా ఫౌండేషన్‌తోపాటు ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌ వంటి అనుబంధ సంస్థలుగా పనిచేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios