National Herald Case: గాంధీ కుటుంబానికి చెందిన రూ. 752 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గాంధీ కుటుంబానికి లింక్ ఉన్న సంస్థల సుమారు రూ. 752 కోట్లను అటాచ్ చేసుకుంది. ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది.
హైదరాబాద్: ఐదు అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో మరోసారి సంచలన పరిణామం జరిగింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రూ. 751.9 కోట్లు ప్రాపర్టీలను అటాచ్ చేసుకున్నట్టు వెల్లడించింది. ఈ సొమ్ము గాంధీ కుటుంబంతో లింక్ ఉన్న కంపెనీలకు చెందినది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియన్ సంస్థల వ్యవహారం ఉన్నది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ.661.69 కోట్లు, యంగ్ ఇండియన్ అధీనంలోని 90.21 కోట్లను అటాచ్ చేసుకున్నట్టు ఈడీ ఎక్స్ వేదికగా వెల్లడించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇది వరకే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
National Herald Case:
నేషనల్ హెరాల్డ్ పేపర్ పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్). ఏజేఎల్‌ను యంగ్ ఇండియన్ సొంతం చేసుకుంది. యంగ్ ఇండియన్ షేర్ హోల్డర్లు సోనియా గాందీ, రాహుల్ గాంధీ. సుమారు 800 కోట్ల విలువైన ఏజెల్ ఆస్తులను యంగ్ ఇండియన్ సొంతం చేసుకుంది. యంగ్ ఇండియన్ షేర్ హోల్డర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కాబట్టి, వీరు టాక్స్ చెల్లించాల్సే ఉంటుందని ఐటీ శాఖ చెబుతున్నది. అయితే.. యంగ్ ఇండియన్ అనేది స్వచ్ఛంద సంస్థ అని, దాని షేర్ హోల్డర్లు ఆ సంస్థ నుంచి లాభాలను తీసుకోరని కాంగ్రెస్ వాదిస్తున్నది.
Also Read: Unemployment: బీఆర్ఎస్‌కు నిరుద్యోగుల సవాల్.. ఆకట్టుకుంటున్న హస్తం మ్యానిఫెస్టో.. రంగంలోకి కేటీఆర్
యంగ్ ఇండియన్ అనేది ఏ చారిటబుల్ కార్యకలాపాలు చేపట్టలేదని ఈడీ చెబుతున్నది. కాబట్టి, ఆ సంస్థకు లాభాలు పొందే అర్హత ఉండదని వివరిస్తున్నది. ఈ సంస్థ చేసిన ఒకే ఒక లావాదేవీ ఏమిటంటే.. ఏజేఎల్ రుణాలను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం. అయితే, దీనిపై కాంగ్రెస్ వాదన వేరుగా ఉన్నది. న్యూస్ పేపర్ అనేది స్వయంగా ఒక చారిటబుల్ అని కాంగ్రెస్ అంటున్నది.
కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది. ఇందులో భాగంగా తాజాగా పెద్ద మొత్తంలో ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది. అయితే, ఐదు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో ఈడీ ఈ ఆస్తులను అటాచ్ చేయడం రాజకీయంగా దుమారం రేగుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థల విషయమై ఇప్పటికే ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.