జమ్ముకాశ్మీర్ లోని శ్రీనగర్ లో గురువారం సాయంత్రం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 4గురు జవాన్లకు గాయాలయ్యాయి. బుధవారం సాయంత్రం కూడా ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో 6గురు ఉగ్రవాదులు చనిపోయారు. 

JAMMU & KASHMIR ENCOUNTER : జ‌మ్ము కాశ్మీర్‌లో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. న‌లుగురు భ‌ద్రతా సిబ్బందికి గాయాల‌య్యాయి. ఎన్ కౌంట‌ర్ ను జ‌మ్ముకాశ్మీర్ పోలీసులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. శ్రీనగర్‌లోని పాంథా చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్న‌ట్టు నిర్దిష్ట స‌మాచారం పోలీసుల‌కు అందింది. దీంతో గురువారం సాయంత్రం సీఆర్ పీఎఫ్‌, జ‌మ్ముకాశ్మీర్ పోలీసు జాయింట్ టీమ్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశంలో భద్రతా బలగాలు సున్నితంగా దాడి చేశాయి. దీంతో ఉగ్ర‌వాదులు అటు నుంచి కాల్పులు జ‌రిపాయి. దీంతో ఇరువైపుల నుంచి భారీ కాల్పులు కొన‌సాగాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు హ‌తమార్చాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామ‌ని జ‌మ్ముకాశ్మీర్ కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో ఒకరు జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన సుహైల్ అహ్మద్ రాథర్‌గా గుర్తించామ‌ని ఆయ‌న చెప్పారు. 

సవతులతో కలిసి ఉండాలని, బలవంతంగా కాపురం చేయమని భార్యకు చెప్పలేం.. గుజరాత్ కోర్టు సంచలన తీర్పు..

బుధ‌వారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 6 గురు ఉగ్ర‌వాదుల హ‌తం..
బుధ‌వారం సాయంత్రం జ‌మ్ముకాశ్మీర్ లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో 6 గురు ఉగ్ర‌వాదులు మృతి చెందారు. మేర‌కు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గురువారం ఉద‌యం వివ‌రాలు వెల్ల‌డించాయి. తీవ్ర‌వాద వ్య‌తిరేక చ‌ర్య‌ల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్, కుల్గాం జిల్లాల్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు బుధ‌వారం సాయంత్రం కాల్పులు జ‌రిపాయి. ఇందులో నిషేధిత ఉగ్రవాద సంస్థ జేఈఎమ్‌కు చెందిన 6 గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్ద‌రు పాకిస్తాన్‌కు చెందిన వారు కాగా.. మ‌రో ఇద్ద‌రిని స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు. మ‌రో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు ఏ ప్రాంతానికి చెందిన వారు అనేది తెలియ‌రాలేదు.మొదటి ఎన్‌కౌంటర్ నౌగామ్ అనంత్‌నాగ్‌లో ప్రారంభమైంది, ఈ కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు. ఆ తర్వాత జరిగిన ఎదురుకాల్పుల్లో పాక్ ఉగ్రవాది సహా ముగ్గురు ఉగ్రవాదులు హత‌మ‌య్యారు. అనంత‌రం భద్రతా దళాలు కుల్గామ్‌లోని మిర్హామా వద్ద మరో ఆపరేషన్ ప్రారంభించాయి, అక్కడ జ‌రిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యార‌ని జమ్ముకాశ్మీర్ పోలీసులు తెలిపారు. 

దారుణం : ఐదు నెలలుగా.. ఇద్దరు 9 యేళ్ల చిన్నారులపై అఘాయిత్యం.. కాపాడాల్సినవాడే కాటేశాడు...