తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. మొదటి సారిగా అత్యాచార బాధితురాలి కుమారుడికి నష్టపరిహారం

అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షలు, ఈ సంబంధం ద్వారా జన్మించిన ఆమె కుమారుడికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి తీర్పు రావడం ఇదే మొదటి సారి. 

Sensational judgment of Telangana High Court.. For the first time compensation to the son of the rape victim..ISR

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ కేసులో అత్యాచార బాధితురాలి కుమారుడికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే అని తేల్చి చెప్పింది. ఇలాంటి తీర్పు వెలువడటం తెలంగాణలో ఇదే తొలిసారి. ‘దక్కన్ క్రానికల్’ కథనం ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో 13 ఏళ్ల అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షలు, ఆ సంబంధం ద్వారా జన్మించిన ఆమె కుమారుడికి రూ.5 లక్షలు పరిహారం ఇవ్వాలని షాద్ నగర్ లోని పోక్సో చట్టం కేసుల ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటించింది.

నెరవేరిన లతా మంగేష్కర్ చివరి కోరిక.. తిరుమల శ్రీవారికి భారీ విరాళం ఇచ్చిన కుటుంబం..

బాధితురాలు ఓ దళితురాలు. 30 ఏళ్ల నిందితుడు, ఆమె ఒకే గ్రామానికి చెందిన వారు. 2017లో ఆమె స్కూల్ కు వెళ్లే సమయంలో అతడు బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మాయమాటలు చెప్పి బలవంతంగా శారీరక సంబంధంలోకి దింపి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది.

గుండెపోటుతో ‘మిస్టర్ తమిళనాడు’ టైటిల్ విన్నర్ మృతి.. ఆ పొరపాటే కొంపముంచింది..

అయితే ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలని బాధితురాలు నిందితుడిని కోరింది. కానీ దళితురాలు అనే కారణంతో నిందితుడు ఆమెను పెళ్లి చేసుకోలేదు. ఆమెకు దూమయ్యాడు దీంతో బాధితురాలు షాద్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మార్చిలో విచారణ ప్రారంభించిన కోర్టు సోమవారం తుది తీర్పును వెలువరించింది.

కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం: బస్సు యాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన

నిందితుడి పితృత్వాన్ని రుజువు చేసిన డీఎన్ఏ పరీక్ష నివేదికను పరిగణనలోకి తీసుకున్న కోర్టు అతడిపై అభియోగాలను దోషిగా నిర్ధారించి తీర్పును వెలువరించిందని అదనపు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీజే రామకృష్ణ తెలిపారు. అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షలు, బాధితరాలి కుమారుడికి రూ.5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. కాగా.. ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరిగేలా చూసిన దర్యాప్తు అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, ప్రాసిక్యూటర్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios