Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం.. పోలీసుకు గాయాలు

జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో మంగళశారం తెల్లవారుజామున భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఈ ఘటనలో ఓ పోలీసుకు కూడా గాయాలు అయ్యాయి. 

Encounter in Kulgam, Jammu and Kashmir.. Terrorist killed.. Policeman injured..ISR
Author
First Published Jun 27, 2023, 8:30 AM IST

జమ్మూకాశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఈ కాల్పుల సమయంలో ఓ పోలీసుకు కూడా గాయాలు అయ్యాయి. ఆ ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని, అతడి గుర్తింపును కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు కుల్గాం జిల్లాలోని హౌరా గ్రామంలో సోమవారం అర్థరాత్రి ప్రారంభమయ్యాయని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ లో వరదల బీభత్సం.. ఆరుగురు మృతి, 124 రోడ్లు ధ్వంసం.. 300కు పైగా మూగ జీవాల మృత్యువాత

‘‘కుల్గాం జిల్లాలోని హౌరా గ్రామంలో ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. ఒక జేకేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. ఆపరేషన్ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. కాగా.. ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ వోసీ) వెంబడి భారీ చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేసిన కొద్ది రోజులకే ఈ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ జరగడం గమనార్హం.

కుప్వారాలోని మచల్ సెక్టార్ లోని కాలా జంగిల్ ప్రాంతంలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఉగ్రవాదులను మట్టుబెట్టారు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖకు సమీపంలోని జుమ్గుండ్ కెరాన్ వద్ద చొరబాటు యత్నాన్ని భగ్నం చేస్తూ భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన వారం తర్వాత ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది.

ప్రధాని మోడీకి సవాల్ విసిరేందుకు పాట్నాలో 'వాగ్నర్ గ్రూప్' ఏకమైంది : ప్రతిపక్షాల సమావేశంపై సామ్నా వింత పోలిక

పీఓజేకే (పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్) నుంచి తమ వైపుకు చొరబడేందుకు ప్రయత్నించిన నలుగురు ఉగ్రవాదులను కుప్వారాలోని మచల్ సెక్టార్ కాలా జంగిల్ లో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో హతమార్చారని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి యుద్ధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయని భారత ఆర్మీకి చెందిన చినార్ కార్ప్స్ ట్వీట్ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios