హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మాత్తుగా సంభవించిన వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ వరదల వల్ల ఆరుగురు మరణించారు. 10 మంది గాయాలు అయ్యాయి. 300కు పైగా మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి.
హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక్క సారిగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఆరుగురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారని ప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓంకార్ చంద్ శర్మ తెలిపారు. మొత్తం 303 జంతువులు చనిపోయాయని పేర్కొన్నారు.
మణిపూర్ పరిస్థితిపై మంత్రులతో ప్రధాని మోడీ కీలక సమావేశం..
వర్షాల కారణంగా రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వానల వల్ల రెండు జాతీయ రహదారులు సహా 124 రోడ్లు దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. మండీలోని 7 మైల్ వద్ద చండీగఢ్-మనాలి హైవేపై వాహనాల ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల మండీ-కులు జాతీయ రహదారి (ఎన్హెచ్)ను పోలీసులు మూసివేశారు. మండీ-జోగిందర్ నగర్ హైవే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా స్థానిక పోలీసులు ఆదివారం దిగ్బంధించారు. రాష్ట్రంలోని మండి జిల్లాలోని బాగిపుల్ ప్రాంతంలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, స్థానికులు సహా 200 మందికి పైగా చిక్కుకుపోయారు.
ఈ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మండి జిల్లా పోలీసు పధార్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ సూద్ తెలిపారు. వర్షాకాల ఏర్పాట్లపై చర్చించేందుకు జూన్ 21న సంబంధిత శాఖలు, డ్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించామని ఓంకార్ చంద్ శర్మ తెలిపారు.
