Asianet News TeluguAsianet News Telugu

ఛత్తీస్‌గఢ్ లో ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి.. అమెరికాలో తయారైన ఆయుధం స్వాధీనం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఒకటి అమెరికాలో తయారు చేసిన ఆయుధం ఉందని పోలీసులు తెలిపారు. 

Encounter in Chhattisgarh.. Four Maoists killed. American made weapon seized
Author
First Published Dec 4, 2022, 4:42 PM IST

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా అటవీ ప్రాంతంలో నవంబర్ 26న జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఈ నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో ఒకటి అమెరికా తయారు చేసిన ఎం 1 కార్బైన్ ఉందని భద్రతా అధికారులు వెల్లడించారు. 

బుల్డోజర్లతో ఇల్లు కూల్చడం ఓ తమాషా అయిపోయింది.. అధికారులతో డబ్బులు కట్టిస్తా..: పోలీసులపై హైకోర్టు జడ్జీ ఫైర్

ఇతర అసాల్ట్ రైఫిళ్లతో పోలిస్తే అమెరికా తయారు చేసిన ఆయుధం బ్యారెల్ చిన్నదని, దీనిని హ్యాండిల్ చేయడానికి సౌకర్యంగా ఉంటుందని అధికారులు తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది. స్వాధీనం చేసుకున్న తుపాకీ సీరియల్ నెంబర్ ఆధారంగా నక్సలైట్లు ఇంత అధునాతన ఆయుధాన్ని ఎక్కడి నుంచి, ఎలా కొనుగోలు చేశారో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో శనివారం పొమారా గ్రామ అడవుల్లో నక్సల్‌ డివిజనల్‌ కమిటీ సభ్యులు మోహన్‌ కడ్టీ, సుమిత్ర, మట్వారా ఎల్‌వోఎస్‌ కమాండర్‌ రమేష్‌తో పాటు దాదాపు 40 మంది మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ల సంయుక్త బృందాన్నిపెట్రోలింగ్ కు వెళ్లింది. ఆటవీ ప్రాంతంలోకి చేరుకోగానే నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. కొద్దిసేపు ఎదురుకాల్పులు జరగడంతో నక్సల్స్ అక్కడి నుంచి పారిపోయారు.

ఇక వికలాంగులందరికీ త్వరలో వర్క్ ఫ్రం హోం అవకాశం - తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక ప్రకటన

అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిని పరిశీలించగా అక్కడ ముగ్గురు నక్సల్స్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా మరో మృతదేహం లభించింది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. భద్రతా బలగాలు అక్కడి నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. 

ఇంతకు ముందు డిసెంబర్ 2011, ఏప్రిల్ 2014లో ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలోని రౌఘాట్, భానుప్రతాప్‌పూర్ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ల తరువాత కూడా భద్రతా దళాలు ‘మేడ్ ఇన్ యుఎస్‌ఎ’ గుర్తులతో కూడిన రెండు 7.65 ఎంఎం ఆటోమేటిక్ పిస్టల్‌లను స్వాధీనం చేసుకున్నాయని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది. అలాగే 2018లో సుక్మా జిల్లాలో నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ‘మేడ్ ఇన్ జర్మనీ’ అని రాసి ఉన్న రైఫిల్ ను, నారాయణపూర్ జిల్లాలో అమెరికా తయారు చేసిన సబ్ మెషిన్ గన్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీ వికటించి వ్యక్తి మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం.. ఎక్కడంటే ?

కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీసు శిబిరంపై నక్సల్స్ కాల్పులు జరపడంతో నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని జైగూర్ క్యాంపులో ఈ ఘటన జరిగింది. గాయపడిన నలుగురిలో ముగ్గురు బీజాపూర్ పోలీసు దళానికి చెందిన వారు కాగా.. మిగిలిన ఒకరు ఛత్తీస్‌గఢ్ సాయుధ దళానికి చెందిన వారు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios