ఆఫీసుకు వచ్చే ఉద్యోగులందరూ ఫార్మల్స్ ధరించి రావాలని, జీన్స్, టీషర్ట్స్ వేసుకోకూదని బీహార్ విద్యాశాఖ తన ఉద్యోగులను కోరింది. ఈ మేరకు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉద్యోగులు జీన్స్, టీ షర్టులు ధరించి ఆఫీసుకు రావొద్దని బీహార్ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశాల్లో సంస్కృతికి విరుద్ధంగా ఉన్నందున అలాంటి దుస్తులు ధరించకూడదని కోరింది. ఉద్యోగులు టీషర్టులు, జీన్స్ ధరించి కార్యాలయాలకు రావడాన్ని నిషేధిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటివ్) బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

బక్రీద్ రోజున జంతువులను అక్రమంగా వధించొద్దు - బాంబే హైకోర్టు

కార్యాలయ సంస్కృతికి విరుద్ధంగా ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు దుస్తుల్లో కార్యాలయాలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ఉత్తర్వు పేర్కొంది. ‘‘ అధికారులు లేదా ఇతర ఉద్యోగులు కార్యాలయంలో క్యాజువల్స్ ధరించడం కార్యాలయంలో పని సంస్కృతికి విరుద్ధం. కాబట్టి అధికారులు, ఉద్యోగులు అందరూ ఫార్మల్ దుస్తుల్లోనే విద్యాశాఖ కార్యాలయాలకు రావాలి. విద్యాశాఖ కార్యాలయాల్లో జీన్స్, టీషర్టులు వంటి సాధారణ దుస్తులకు ఇప్పటి నుంచి అనుమతి లేదు’’ అని ఉత్వర్వుల్లో అధికారులు తెలిపారని వార్తా సంస్థ ‘పీటీఐ’ నివేదించింది. 

Scroll to load tweet…

కాగా.. సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ఏప్రిల్ లో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ జీన్స్, టీ షర్టులు ధరించకుండా నిషేధం విధించింది. ఫార్మల్ దుస్తులు ధరించాలని, గుర్తింపు కార్డులు తీసుకురావాలని కోరింది. 2019లో బీహార్ ప్రభుత్వం ఉద్యోగుల హోదాతో సంబంధం లేకుండా రాష్ట్ర సచివాలయంలో జీన్స్, టీషర్టులు ధరించడాన్ని నిషేధించింది. కార్యాలయ మర్యాదను కాపాడటమే లక్ష్యమని, సచివాలయంలోని ఉద్యోగులు సింపుల్, సౌకర్యవంతమైన, లేత రంగు దుస్తులు ధరించాలని ప్రభుత్వం కోరింది.