Asianet News TeluguAsianet News Telugu

దారుణం : నోట్లో పేలిన నాటు బాంబు.. ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఏనుగు

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటు బాంబు పేలింది. దీంతో ఏమి తినలేక ఆకలితో ప్రాణాలొదిలింది . ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 

 Elephant starves to death after country-made bomb explodes in mouth in tamilnadu ksp
Author
First Published Sep 6, 2023, 2:27 PM IST | Last Updated Sep 6, 2023, 2:27 PM IST

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆరేళ్ల ఆడ ఏనుగు నోటిలో నాటు బాంబు పేలింది. దీంతో ఏమి తినలేక ఆకలితో ప్రాణాలొదిలింది. అడవి పందులు తమ పొలాల్లోకి రాకుండా నిరోధించడానికి అవుత్తుకై అని పిలిచే బాంబును ఇక్కడి స్థానికులు పండ్లు , కూరగాయాలలో పెట్టి వుంచుతారు. ఏదైనా జంతువు దానిని కొరికినప్పుడు అది పేలి.. జంతువు నోటికి తీవ్ర గాయమవుతుంది. ఈ నేపథ్యంలో తడగాం అటవీ రేంజ్‌లోని ఇటుక బట్టీ సమీపంలో ఏనుగు సంచరిస్తోందని స్థానికులు అటవీ అధికారులను అప్రమత్తం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

సమాచారం అందుకున్న అధికారులు, పశువైద్య బృందం ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర గాయంతో బాధపడుతున్న ఏనుగుకు ఇంట్రావీనస్ మెడిసన్, గ్లూకోజ్ అందించారు. ఈ క్రమంలో నిషేధిత ‘‘అవుట్టుకై’’ అనే నాటు బాంబును ఏనుగు కొరికినట్లుగా పశువైద్య బృందం గుర్తించింది. ఇటీవలే కేరళ నుంచి తమిళనాడులోని అటవీ ప్రాంతంలోకి బాధిత ఏనుగు ప్రవేశించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఏనుగు ఈ బాంబును ఎక్కడ కొరికిందో తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios