Asianet News TeluguAsianet News Telugu

Lok Sabha election 2024: ప్రపంచంలో అత్యధిక ఓట‌ర్లు గ‌ల దేశంగా భార‌త్‌.. ఓట‌ర్ల సంఖ్య ఎంతంటే?

Lok Sabha election 2024: రానున్న లోక్‌సభ ఎన్నికలకు 96.88 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులని, ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లుగా అవతరించారని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) శుక్రవారం వెల్లడించింది.  

Election Commission Says Over 96 Crore People Registered To Vote For 2024 Lok Sabha Election KRJ
Author
First Published Feb 10, 2024, 12:20 AM IST | Last Updated Feb 10, 2024, 12:20 AM IST

Lok Sabha election 2024: ప్రజాస్వామ్య భారతదేశంలో అతిపెద్ద పండుగ త్వరలో జరుగబోతుందనీ, ఈ సారి మహా పండుగకు 97 కోట్ల మంది ప్రజలు ఓట్లు వేయనున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడానికి అర్హులు అవుతారని, వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని భారత ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది.

ఈ ఏడాది కొత్తగా రెండు కోట్ల మందికి పైగా యువత ఓటర్లుగా మారారనీ,  18 నుంచి 19 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు రెండు కోట్ల మందికి పైగా జాబితాలో చేరారని ఎన్నికల సంఘం తెలిపింది. గత లోక్‌సభ ఎన్నికల (2019)తో పోలిస్తే ఈసారి ఆరు శాతం ఓటర్లు పెరిగారని ఎన్నికల సంఘం తెలిపింది.

దాదాపు 97 కోట్ల మంది ఓటు 

ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు వేస్తే ఇదొక రికార్డు అని ఈసీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు (96.88 కోట్లు) భారతదేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఇది కాకుండా.. లింగ నిష్పత్తి 2023లో 940 నుండి 2024 నాటికి 948కి పెరిగింది. ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చామని, జాబితా కచ్చితత్వంపై పూర్తి శ్రద్ధ పెట్టామని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.

ఈ సందర్బంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మట్లాడుతూ.. 2019 నుండి నమోదైన ఓటర్లలో ఆరు శాతం పెరుగుదల ఉందనీ,  ప్రపంచంలోనే అతిపెద్ద ఓటర్లు 96.88 కోట్ల మంది వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. లింక్ నిష్పత్తి 2023లో 940 నుండి 2024లో 948కి పెరిగిందని పోల్ ప్యానెల్ నివేదించింది.  రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో పాటు ఓటరు జాబితాల సవరణ కోసం వివిధ పనుల గురించి సమాచారం ఇచ్చారు. మహిళా ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందని తెలిపారు.

యూపీలో అధిక ఓటర్లు  

కమిషన్ తాజా డేటా ప్రకారం.. UPలో అత్యధికంగా 15.30 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. లక్షద్వీప్‌లో అత్యల్పంగా ఓటర్లు నమోదయ్యారని తెలిపారు.దేశవ్యాప్తంగా కమిషన్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత.. దాదాపు 1.65 కోట్ల మంది పేర్లు తొలగించబడ్డాయి. వీటిలో మరణించిన 67.82 మంది పేర్లు ఉన్నాయి. అదే సమయంలో, 75.11 లక్షల మంది శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారారు లేదా ఓటర్లు గైర్హాజరయ్యారు.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios