తొలిదశ లోక్‌సభ ఎన్నికలు: నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ


 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవలనే  ఈసీ  షెడ్యూల్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే తొలి దశలో భాగంగా నిర్వహించే  ఎన్నికలకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Election Commission Issues Notification For First Phase Of Lok Sabha Elections lns

న్యూఢిల్లీ:తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారంనాడు విడుదలైంది.లోక్‌సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు  సంబంధించి  ఈ నెల  16న  ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది.  ఏడు దశల్లో  లోక్ సభ ఎన్నికలను  నిర్వహించనుంది. తొలి దశలో లోక్ సభ ఎన్నికలు జరిగే  స్థానాల్లో  నోటిఫికేషన్ ను  ఇవాళ  ఎన్నికల సంఘం  ఇవాళ విడుదల చేసింది.

also read:ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: వీరికే ఛాన్స్?

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడంతో  ఇవాళ్టి నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. మార్చి 27వ తేదీ వరకు  నామినేషన్ల స్వీకరణకు చివరి తేది. మార్చి 28న నామినేషన్లను పరిశీలించనున్నారు.ఈ నెల  30వ తేదీ వరకు  నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది.ఏప్రిల్  19న తొలి దశ పోలింగ్ నిర్వహించనున్నారు.

also read:రైల్వేలో నకిలీ ఎస్ఐ అవతారం:నల్గొండ జిల్లాలో యువతి అరెస్ట్

దేశంలోని  17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని  102 లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్  19న పోలింగ్ జరగనుంది.  నామినేషన్లను ఇవాళ్టి నుండి స్వీకరించనున్నారు.తమిళనాడు రాష్ట్రంలోని  39, రాజస్ధాన్ లోని  12,  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆరు, ఉత్తరాఖండ్ అసోం, మహారాష్ట్రల్లో  ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

also read:ఏనుగును బంధించేందుకు ఫారెస్ట్ అధికారుల యత్నం: రోడ్డుపై పరుగులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

బీహార్ లో నాలుగు, పశ్చిమ బెంగాల్ లోని మూడు,అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ , మేఘాలయ రాష్ట్రాల్లో  రెండు స్థానాల్లో, ఛత్తీస్‌ఘడ్, మిజోరం, నాగాలాండ్ ,సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్ , లక్షద్వీప్ , పాండిచ్చేరి రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.  ఈ ఏడాది జూన్  4న కౌంటింగ్ జరగనుంది.

తొలి దశ పోలింగ్  ఈ ఏడాది ఏప్రిల్  19న జరుగుతుంది. రెండో దశ పోలింగ్ ఏప్రిల్  26న జరుగుతుంది. మూడో దశ మే 7న జరుగుతుంది. నాలుగో దశ మే 13న నిర్వహించనున్నారు. ఆరో దశ మే 25న నిర్వహిస్తారు. ఏడో దశ జూన్  1న నిర్వహిస్తారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios