ఏనుగును బంధించేందుకు ఫారెస్ట్ అధికారుల యత్నం: రోడ్డుపై పరుగులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
అడవి నుండి జవాసాల మధ్యకు ఏనుగుల గుంపు కోయంబత్తూరుకు సమీపంలోకి వచ్చింది. అయితే ఓ ఏనుగు జనావాసాల మధ్యకు వచ్చింది.ఈ ఏనుగును అడవిలోకి పంపేందుకు అటవీశాఖాధికారులు ఇబ్బందులు పడ్డారు.
చెన్నై:కోయంబత్తూరుకు సమీపంలోని రోడ్డుపై ఓ ఏనుగు పరుగులు పెట్టింది. ఈ ఏనుగును బంధించేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించిన సమయంలో రోడ్డుపై ఏనుగు పరుగులు తీసింది. ఏనుగు దాడిలో ఓ వ్యక్తి గాయపడ్డారు.గాయపడిన వ్యక్తిని మారుతముత్తుగా గుర్తించారు.
అడవుల నుండి 30 ఏనుగులు కోయంబత్తూరు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ , మరుధమలై రోడ్డు సమీపంలో ఆశ్రయం పొందాయి. అయితే ఈ నెల 17న నగరంలోని పేరూర్ పరిసరాల్లో ఏనుగు సంచరించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. పేరూరు-సిరువాణి ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పొలానికి వెళ్లడానికి ముందు తన నివాస ప్రాంతంలో ఉన్న వృద్దుడిపై ఏనుగు దాడి చేసింది.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.ఏనుగు దాడిలో గాయపడిన వృద్దుడికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు చెప్పారు. ఇటీవలనే కరడిమడై గ్రామంలో కూడ దాడి ఘటనకు ఇదే ఏనుగు కారణమని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.ఈ ఘటనలో వృద్ద మహిళతో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు.ఆహారం కోసం ఏనుగులు నివాస ప్రాంతాలకు వచ్చినట్టుగా అటవీశాఖాధికారులు చెబుతున్నారు. కోయంబత్తూరు ఫామ్ హౌస్ లో నిల్వ చేసిన బియ్యం, మినుములు, పశువుల దాణాపై కూడ ఏనుగు దాడి చేసిన విషయాన్ని అధికారులు గుర్తించారు.
ఏనుగును అడవిలోకి తరిమేందుకు అటవీశాఖాధికారులు ఇబ్బంది పడ్డారు. ఈ సమయంలో జనాన్ని నియంత్రించడం కష్టంగా మారింది. ఏనుగును అడవిలోకి తరిమే సమయంలో పలువురు ఫోటోలు, వీడియోలు తీశారు. అయితే ఏనుగు