ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధులైన ఇద్దరు భార్య భర్తలను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. ఈ దారుణ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రం దాద్ గమ్మ ప్రాంతానికి చెందిన సత్రి ముందా(60), జానీ దేవి(55) దంపతులు నివసిస్తున్నారు. వీరికి రామ్ ముందా(14) అనే కుమారుడు, రాధా హన్స అనే కుమార్తె ఉంది. గురువారం నలుగురు ఇంట్లో నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు.

వారు నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో నరికి చంపేశారు.  వారి కుమారుడు, కుమార్తె స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని దారుణంగా హత్య చేయడంతోపాటు వారి తలను కూడా వారి వెంట తీసుకువెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు వివరించారు.