ఓ ఎనిమిదేళ్ల చిన్నారిమీద స్కూలు టాయిలెట్ లో అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఆ చిన్నారి స్కూల్లో చేరిన ఆరు రోజులకే ఆ చిన్నారికి ఇలాంటి భయానక అనుభవం ఎదురయ్యింది.
మధ్యప్రదేశ్ : Madhya Pradeshలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనతో చిన్నారులు చదువుకోవడానికి schoolకి వెళ్లినా వారికి రక్షణ కరువవుతుందనే భయం తల్లిదండ్రుల్లో నెలకొనేలా చేసింది. Fourth class చదువుతున్న ఓ విద్యార్థినిపై స్కూల్ లోని మరుగుదొడ్డిలో అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టాడో కామాంధుడు, స్కూల్ లో పనిచేసే వాచ్మెన్ లక్ష్మీనారాయణ ఈ అకృత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్ భోపాల్ లోని కోహెఫిజా ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 8 ఏళ్ల వయసున్న బాధితురాలు ఆరు రోజుల క్రితం పాఠశాలలో కొత్తగా చేరింది.
శుక్రవారం మధ్యాహ్నం భోజనం సమయంలో బాధితురాలు టాయిలెట్ కి వెళ్ళింది. ఆ సమయంలో నిందితుడు ఆమె మీద ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీంతో భయంతో బాలిక గట్టిగా ఏడ్చింది. ఆమె ఏడుపుకు అక్కడికి చేరుకున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఏం జరిగిందని బాలికను ఆరా తీశారు. అప్పటికి భయంతో వణికిపోతున్న బాలిక… పసుపు చొక్కా వేసుకున్న వ్యక్తి తనను మరుగుదొడ్డిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు అని తెలిసింది. పోలీసులకు సమాచారం అందించగా వారు విచారణ ప్రారంభించారు. నిందితుడు లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు.
కాగా, ఇలాంటి ఘటనలో జూలై 5న ఓ కామాంధుడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తెలంగాణరాష్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా జడ్జి తీర్పునిచ్చారు. కొత్తగూడెంకు చెందిన శ్రీనివాస్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు 2019 మే 7న స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దీనిమీద దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో 13 మంది సాక్షులను విచారించారు. ఆ తర్వాత శ్రీనివాస్ పై ఆరోపించిన నేరం రుజువైందని న్యాయస్థానం భావించింది. దీంతో శ్రీనివాస్ కి సెక్షన్ 42 Pocso act ప్రకారం 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10వేల జరిమానా లేదా జరిమానాకు బదులుగా ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 56 భారత శిక్షాస్మృతి ప్రకారం రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. మూడు వేల జరిమానా లేదా జరిమానా కింద రెండు నెలల కారాగారశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు నిచ్చారు.
కాగా, జూలై 1న కూడా ఇలాంటి కేసులో ఓ నిందితుడికి త్రిపుర కోర్టు మరణశిక్ష విధించింది. నాలుగున్నరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడు... ఆ తర్వాత ఆమెను హత్య చేశాడు. ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యక్తిని అరెస్టు చేశారు. త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. జిల్లా కోర్టు, ప్రత్యేక పోక్సో చట్టం న్యాయమూర్తి శంకరి దాస్ ఈ తీర్పు వెలువరించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో లోయలోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు మృతి
ఈ కేసు పూర్వాపరాలలోకి వెళితే… అగర్తలలోని ఖోవై జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. అక్కడ తెలియమురా ప్రాంతానికి చెందిన నాలుగున్నరేళ్లు బాలిక నిరుడు ఫిబ్రవరిలో ఇంటిముందు ఆడుకుంటుంది. అప్పటివరకు ఆడుకుంటున్న చిన్నారి.. కాసేపటికే కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. అలా తప్పిపోయిన చిన్నారి... ఆరు రోజుల తర్వాత ఒంటినిండా గాయాలతో విగతజీవిగా కనిపించింది.
