ఎనిమిది నెలల గర్బిణి సొంతింట్లో అనుమానాస్పద మృతి... పరారీలో భర్త...
ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో శుక్రవారం ఎనిమిది నెలల గర్భిణి తన ఇంట్లో శవమై కనిపించింది. మహిళ మృతి తర్వాత అక్కడి నుంచి భర్త పారిపోవడంతో, భర్తపై పోలీసులకు అనుమానం కలిగింది.

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో శుక్రవారం ఎనిమిది నెలల గర్భిణి తన ఇంట్లో శవమై కనిపించింది. అత్తమామలు పొలం నుంచి తిరిగి వచ్చేసరికి రక్తంతో తడిసిన ఆమె మృతదేహాం ఇంట్లో కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మహిళ మృతదేహం వద్ద విరిగిన గాజులు కనిపించాయి.
ప్రాథమిక విచారణలో మహిళ గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. అయితే పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి అసలు కారణం తెలియనుంది. మహిళ మరణం తర్వాత సంఘటనా స్థలం నుండి భర్త కనిపించకుండా పోయాడు. దీంతో పారిపోయిన భర్తపై పోలీసులకు అనుమానం పెరిగింది.
రూ. 2000 మార్పిడికి గడువు నేటితో ముగింపు.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
రాఖీదేవి అనే మహిళకు 2021లో రాజేంద్రతో వివాహమైంది. మద్యానికి బానిసైన రాజేంద్ర తరచూ రాఖీతో గొడవపడేవాడు. శుక్రవారం ఉదయం అత్తమామలు పొలానికి పనికోసం వెళ్లగా.. ఇంట్లో రాఖీ ఒంటరిగా ఉంది. రాజేంద్ర మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. ఆ తరువాత భార్యతో గొడవపడి, హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. విరిగిన గాజులు రాఖీ మరణానికి ముందు అతనితో పెనుగులాడినట్లు సూచిస్తుంది.
"రాఖీ ఎనిమిది నెలల గర్భిణి. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. రాజేంద్ర తన భార్యను అనుమానించేవాడు. ఆమె ఎవరితోనైనా మాట్లాడినప్పుడల్లా ఆమె ఫోన్‌ను తనిఖీ చేసేవాడు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు" అని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆధారాలు సేకరిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు.