Asianet News TeluguAsianet News Telugu

రూ. 2000 మార్పిడికి గడువు నేటితో ముగింపు.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?

రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. ఈ రోజు సమీపంలోని బ్యాంకుకు వెళ్లి రూ. 2000 నోట్లను మార్చుకోవాలి. లేదంటే.. ఆ కరెన్సీ నోటు విలువ లేని కాగితంగా మిగిలిపోతుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి రూ. 2000 నోట్లను లావాదేవీలకు అంగీకరించారు. అయితే, ఆర్బీఐ బ్రాంచీలో మార్చుకునే అవకాశం ఉంటుంది.
 

today is last date for rs 2000 note exchange kms
Author
First Published Sep 30, 2023, 2:45 PM IST | Last Updated Sep 30, 2023, 2:45 PM IST

న్యూఢిల్లీ: రూ. 2000 నోట్లను బ్యాంకులో మార్చుకోవడానికి గడువు నేటితో ముగుస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోపు రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ మే నెలలో సూచించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీ నుంచి రూ. 2000 నోట్లు విలువలేని కాగితాలుగా మారిపోతాయి. రూ. 2000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి తప్పించాలని మే నెలలో ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం సరిపడా గడువు కూడా ఇచ్చింది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పుడు కేంద్ర బ్యాంకు తెలిపింది. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నపళంగా పెద్ద నోట్ల రద్దు (రూ. 1000, రూ. 500) చేసినట్టుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం సమయంలోనే డబ్బును వేగంగా చలామణిలోకి తీసుకువచ్చే అవసరం ఏర్పడింది. అప్పుడు ఆర్బీఐ రూ. 2000 నోట్లను చలామణిలోకి తెచ్చారు.

ఆ తర్వాత రూ. 2000 నోట్లకు ఏం జరుగుతుంది?

ఆర్బీఐ ప్రకారం, రూ. 2000 నోట్లు సెప్టెంబర్ 30 తర్వాత కూడా లీగల్ టెండర్‌గానే కొనసాగుతుంది. అయితే.. వాటిని లావాదేవీల కోసం అంగీకరించరు. ఆ తర్వాత ఈ రూ. 2000 నోట్లను కేవలం ఆర్బీఐలోనే మార్చుకోవాల్సి ఉంటుంది. దేశంలోని 19 ఆర్బీఐ బ్రాంచీల్లో ఈ మార్పిడి చేసుకోవచ్చు. 

Also Read: రేషన్ కార్డు కేవైసీ చివరి తేదీపై మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్.. ఏమన్నారంటే?

కాబట్టి, ఈ రోజులోపే రూ. 2000 నోట్లను మార్చుకోవడం ఉత్తమం. ఖాతా లేని బ్యాంకులోనూ రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చ. అయితే.. కేవైసీ, ఇతర షరతులను పాటించాల్సి ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios