కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ధార్వాడ్: కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

ధార్వాడ్ జిల్లా ఇట్టిగట్టి గ్రామం వద్ద ట్రావెల్స్ వ్యాన్ ను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ట్రావెల్స్ వ్యానులో ప్రయాణీస్తున్న ఎనిమిది మంది మరణించారు. వ్యాన్ లోని మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతో కలిసి స్థానికులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మినీ వ్యాన్ దేవనగర్ నుండి బెళగావి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.

ఈ ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. అతి వేగమే కారణమా, పొగ మంచుతో పాటు ఇతరత్రా కారణాలు ఈ ప్రమాదానికి దారి తీశాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.