రంజాన్ దాతృత్వానికి ప్రతీక  ..  విశ్వాసాల వేడుక

రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు ప్రధానంగా కనిపిస్తాయి. రంజాన్‌ మాసంలో మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అనవాయితీ.

Eid is a celebration of Allah bounties and Muslims faith in Him Krj

ముస్లిం సోదరుల పవిత్ర గ్రంథం 'ఖురాన్‌'. ఈ  గ్రంథం ప్రకారం ముస్లింలు రంజాన్‌ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ఉపవాస దీక్షలు, ఆధ్యాతిక్మక చింతన, దానాలు, ధర్మాలు ప్రధానంగా కనిపిస్తాయి. రంజాన్‌ మాసంలో మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం అనవాయితీ. ఈ నెల జరిగే ప్రార్థనలు ఇతర సమయాల్లో చేసే ప్రార్థనల కంటే ఎక్కువ సేపు జరుగుతుంటాయి. అంటే రాత్రిపూట కూడా ప్రార్థనలు నిర్వహిస్తారు. 

సూర్యోదయానికి ముందు సెహరీతో ప్రారంభమైన ఉపవాస దీక్ష ప్రతి రోజూ సూర్యాస్తమయం తర్వాత చేసే ఇఫ్తార్ అనే విందుతో ముగిస్తారు. ఇలా ఈ నెల రోజుల పాటు సాగుతోంది. ఈ మాసం చివరి రోజున నెలవంక దర్శనంతో ఉఫవాస దీక్షలను ముగిస్తారు. ఆ తర్వాత ఈద్ ఉల్ ఫీతర్( రంజాన్) అనే పండుగను ముస్లిం సోదరులు చాలా వైభవంగా జరుపుకుంటారు. 
 
 సూర్యోదయం, సంధ్యా సమయాలలో ఉపవాస దీక్షలు చేయాలంటే.. ఆధ్యాతిక్మక చింతన, భక్తి , నిగ్రహం చాలా అవసరం. ఖురాన్ ప్రకారం.. అల్లాహ్ ను చేరుకోవాలంటే.. ఆరాధన, ప్రార్థనలు వంటివి చేయాలనే.. అవే అల్లా అనుగ్రహాన్ని పొందడానికి ఏకైక మార్గమని భావిస్తారు. ఆధ్యాత్మిక భావన అల్లాతో మరింత సంబంధాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతాయని భావిస్తారు. కాబట్టి ఈ నెలలో ప్రియమైన వారితో గడపడం, ఆధ్యాత్మిక భావన ఈ పండుగలోని అంతర్బాగం. అంతర్థం. 

ఈద్ అల్-ఫితర్ (రంజాన్) సమయం చంద్రుని చక్రం(చంద్రమానం) ఆధారపడి ఉంటుంది. అందుకే రంజాన్ ప్రతి ఏడాది వివిధ నెలలో వస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రార్థన సమాయాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.  ముస్లింలు ఈద్ అల్-ఫితర్ మొదటి రోజున తెల్లవారుజామున సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. తమ దైవం అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుతుంటారు.  

ఫజ్ర్ అనే పదం తెల్లవారుజామున ప్రార్థనలను సూచిస్తుంది. అలాగే ఈ మాసంలో వారి ఆహార అలవాట్లు కూడా మారుతాయి. నిత్యం ప్రార్థనలు, మసీదును సందర్శించడం వంటివి చేస్తుంటారు.  ఈ పండుగ సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్ప ర ప్రేమ, శాంతి, సహనాలకు ప్రతీక . రంజాన్ పర్వదినానా ముస్లింలు ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నాడు నిరుపేదలకు విస్మరించకూడదనే తాఖీదును అనుసరించి ప్రతి ముస్లిం తనకు తోచిన మేరకు ఫిత్రా(దానం) ఇస్తారు. ఈ నెల చివరి ఉపవాసం రోజు నెలవంక చూశాక ఈద్‌ నమాజ్‌కు వెళ్లే ముందు ఫి త్రా చెల్లిస్తారు. నిర్భాగ్యులు సైతం పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలనేది అందులోని సారంశం. 

అదే సమయంలో పిల్లలకు బహుమతులు, తీపి పదార్థాలను అందించే సంప్రదాయాన్ని కూడా అనుసరిస్తారు. ఈ రోజున తయారుచేసే ప్రధాన వంటకం 'సేవాయి'.కాబట్టి దీనిని "స్వీట్ ఈద్" అని వర్ణించవచ్చు. దేశానికి మరో దేశానికి బట్టి ఈద్ అల్-ఫితర్ వేడుకలు మారుతూ ఉంటాయి. కానీ కుటుంబం, స్నేహితులను సందర్శించడం, బహుమతులు ఇవ్వడం, విందులను ఆహ్వానించడం, కొత్త బట్టలు ధరించడం, బంధువుల సమాధులను సందర్శించడం వంటివి సాధారణం.  

'ఎవరైతే అల్లాను విశ్వసించి.. సత్కార్యాలు చేస్తారో, నిత్య ప్రార్థనలు, ధార్మికత గలవారికి వారి అల్లా ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది. వారికి భయం ఉండదు, వారు దుఃఖించరు.' - ఖురాన్ 2:277

రచయిత: ఎమాన్ సకీనా

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios