Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌కి కరోనా: క్వారంటైన్‌లో మంత్రి

కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కి బుధవారం నాడు కరోనా సోకింది. కరోనాకు చికిత్స తీసుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

Education Minister Ramesh Pokhriyal Tested COVID Positive lns
Author
New Delhi, First Published Apr 21, 2021, 3:52 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కి బుధవారం నాడు కరోనా సోకింది. కరోనాకు చికిత్స తీసుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని  ఆయన కోరారు. అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ తమ శాఖ కార్యక్రమాలను  నిర్వహిస్తున్నట్టుగా  ఆయన తెలిపారు.

 

కరోనా నేపథ్యంలో యూజీసీ నెట్, ఐఐటీ జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి  వాయిదావేస్తున్నట్టుగా ప్రకటించారు.కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి పరీక్షలను కేంద్రం వాయిదా వేసింది కేంద్రం.దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో సుమారు 3 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో కోవిడ్ తో  మరణాలు కూడ చోటు చేసుకొన్నాయి. దేశంలోని మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి.  మహారాష్ట్రతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో కూడ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios