Asianet News TeluguAsianet News Telugu

జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌ వర్క్‌‌ 2022ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. వివరాలు ఇవే..

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు ఫౌండేషన్ స్టేజ్ 2022 కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ను (జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌మర్క్‌ను) ప్రారంభించారు. అలాగే.. వివిధ ప్రాంతాలకు చెందిన 50 కేంద్రీయ విద్యాలయాలు నేటి నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా “బాలవాటిక” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Education Minister Dharmendra Pradhan launches National Curriculum Framework 2022
Author
First Published Oct 20, 2022, 5:27 PM IST

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేడు ఫౌండేషన్ స్టేజ్ 2022 కోసం నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ను (జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌మర్క్‌ను) ప్రారంభించారు. జాతీయ విద్యా విధానం- 2020 ద్వారా అందించబడిన సూచనల ఆధారంగా జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌మర్క్‌ 2022 రూపొందించబడింది. భారతదేశంలోని విద్యా వ్యవస్థ కోసం సిలబస్, పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులకు సంబంధించిన మార్గదర్శకాలు ఇందులో ఉంటాయి. 

ఈ సందర్బంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంలో పాఠశాల విద్యార్థుల కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ను తయారు చేయడం ఒక ముఖ్యమైన భాగమని అన్నారు. ఈ పాఠ్యాంశాలు దేశంలో ఏకరీతి, అందుబాటులో ఉండే విద్య రూపంలో ఉంటాయని చెప్పారు. ఈ రోజు భారతదేశంలో విద్యా విధానానికి చారిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు. మొదటి ఐదేళ్లలో విద్యార్థులకు ఈ ఫ్రేమ్‌వర్క్ చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని ప్రతి పాఠశాల జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయాల బాలవాటిక కార్యక్రమాన్ని ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 కేంద్రీయ విద్యాలయాలు నేటి నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా “బాలవాటిక” కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో బాల్ వాటికను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి వారి పాఠశాలల్లో బాల వాటికను ప్రారంభిస్తామని చెప్పారు. రానున్న 3-4 ఏళ్లలో దేశంలోని అన్ని పాఠశాలల్లో బాల వాటికను ప్రారంభించేందుకు కృషి చేస్తామని ప్రధాన్ చెప్పారు.


ఇక, జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌మర్క్‌‌లో పాఠశాల విద్య, బాల్యం-విద్య, ఉపాధ్యాయ విద్య, వయోజన విద్యలను.. పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌లుగా విభజించారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) జాతీయ స్థాయిలో జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌మర్క్‌ 2022 కోసం సర్వేను నిర్వహించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఎన్‌సిఎఫ్‌కు సంబంధించిన సర్వేలను నిర్వహించాలని కోరింది. జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌మర్క్‌ 2022, దాని 4 భాగాలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరించిన సమాచారం ఆధారంగా రూపొందించబడ్డాయి.

Follow Us:
Download App:
  • android
  • ios