2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గుజరాత్ రాష్ట్ర దోల్కా నియోజికవర్గ ఎన్నిక చెల్లదని హై కోర్ట్ తీర్పునిచ్చింది. అక్కడ 2017లో కాంగ్రెస్ తరుఫున ఎమ్మెల్యే  అభ్యర్థిగా బరిలో నిలిచినా రాథోడ్ అశ్విని భాయ్ హై కోర్టులో ఆ ఎన్నికను ఛాలెంజ్ చేసారు. 

ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నో అక్రమాలకూ పాల్పడి ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత న్యాయ, విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ ఇక్కడి నుండి కేవలం 327 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. 

అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని, అక్రమాలు చోటుచేసుకున్నాయని కోర్టు గుర్తించి ఆ ఎన్నికను రద్దు చేసింది.కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ సదరు కాంగ్రెస్ అభ్యర్థి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఇదిలా ఉంటె... దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య 70 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో 3,604 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 70,756కు చేరుకుంది. 

కాగా, గత 24 గంటల్లో దేశంలో 87 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. దీంతో కరోనా వైరస్ మరణాల సంఖ్య 2,2293కు చేరుకుంది. ఇప్పటి వరకు దేశంలో 22445 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 46,008 ఉంది.  

ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ నేల 17వ తేదీ వరకు విధించిన లాక్ డౌన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడారు. లాక్ డౌన్ ను కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ కేసులు కొత్తగా నమోదు కాని ప్రాంతాల్లో ఆంక్షలను మరింతగా సడలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో ప్యాసెంజర్ రైళ్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ 15 ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి.