Asianet News TeluguAsianet News Telugu

పెగాసస్ రగడ: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎడిటర్స్ గిల్డ్.. సిట్ విచారణకు డిమాండ్

పెగాసస్ స్పైవేర్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎడిటర్స్ గిల్డ్. సిట్‌తో విచారణ చేయించాలని ఎడిటర్స్ గిల్డ్ పిటిషన్ వేసింది. దీనిని పరిగణనలోనికి తీసుకున్న సుప్రీంకోర్ట్.. ఎల్లుండి విచారణ చేపట్టనుంది. 

Editors Guild moves SC demanding SIT probe into Pegasus snooping ksp
Author
new delhi, First Published Aug 3, 2021, 3:21 PM IST

పెగాసస్ స్పైవేర్‌పై దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎడిటర్స్ గిల్డ్. సిట్‌తో విచారణ చేయించాలని ఎడిటర్స్ గిల్డ్ పిటిషన్ వేసింది. దీనిపై ఎల్లుండి  విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్ట్. 

భారతదేశంలో పెగసాస్  స్పైవేర్ కుంభకోణంలో ప్రతిపక్షాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఫోన్లను ట్యాపింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ధ్వజమెత్తాయి. 

Also Read:పెగాసస్ స్పైవేర్ కేసులో కొత్త ట్విస్ట్ : అనిల్ అంబానీ, దుబాయ్ యువరాణి.., దలైలామా..తో సహ మరికొందరి పేర్లు..

జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ అసమ్మతివాదులతో సహా 300 మందికి పైగా ప్రముఖుల ఫోన్‌లను పెగసాస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి హ్యాక్ చేసినట్లు భారతదేశంలో ఇజ్రాయెల్ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ ఆరోపణలు ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బిజెపి మంత్రులు అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, మాజీ ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ నంబర్లు ఇజ్రాయెల్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్ చేసినట్లు జాబితా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios