అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం సోమవారం గందరగోళ పరిస్థితుల మధ్య జరిగాయి. అయితే ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని సభ్యులు ఎన్నికున్నారు. ఈ ఎన్నికకు ముందు ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. 

సోమవారం జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కె పళనిస్వామి (EPS) ఎన్నికయ్యారు. ఆయ‌న ప్ర‌త్య‌ర్థి, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం (OPS) ను కోశాధికారి పదవి నుంచి, అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి కౌన్సిల్ తొలగించింది. అలాగే ద్వంద నాయ‌క‌త్వ న‌మూనాకు ముగింపు ప‌లికింది. 

భూమికి చేరువగా చంద్రుడు.. బుధవారం అతిపెద్ద సూపర్‌మూన్.. ఎప్పుడు చూడాలంటే?

2,500 మంది సభ్యులతో కూడిన జనరల్ కౌన్సిల్.. పార్టీని ఒకే అత్యున్నత నాయకుడిగా నడిపించడానికి EPSకి అధికారం ఇచ్చింది. అయితే ప్రత్యర్థి నాయకుడు OPS ను పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోప‌ణ‌ల‌తో బ‌హిష్క‌రించారు. ఆయన మద్దతుదారులు ఆర్ వైతిలింగం, పీహెచ్ మనోజ్ పాండియన్‌లను కూడా అన్నాడీఎంకే నుంచి తొలగించారు. తన బహిష్కరణపై ఓ పన్నీర్‌సెల్వం స్పందిస్తూ.. తనను 1.5 కోట్ల మంది పార్టీ కార్యకర్తలు సమన్వయకర్తగా ఎన్నుకున్నారని తెలిపారు. అయినతే బహిష్కరించే హక్కు EPS లేదా మ‌రే ఇత‌ర నాయ‌కుడికి లేద‌ని అన్నారు. 

భూస్వాముల కుటుంబంలో జన్మించినా.. స్వతంత్రం కోసం తుపాకి చేత‌బ‌ట్టిన కెప్టెన్ ల‌క్ష్మీ

కాగా మద్రాస్ హైకోర్టు సోమవారం ఉదయం OPS, ఆయ‌న మద్దతుదారులు దాఖలు చేసిన అభ్యర్ధనలను కొట్టివేసింది. రాజకీయ పార్టీల కుమ్ములాటల్లో జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. దీంతో ప్రిసీడియం ఛైర్మన్ ఎ తమిళ్ మహన్ హుస్సేన్ అధ్యక్షతన జనరల్ కౌన్సిల్ సమావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేందుకు 4 నెలల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించారు. ఈ స‌మావేశంలో పార్టీ అగ్ర స్థానం కోసం పోరాడేందుకు తాజా నిబంధనలను కలిగి ఉన్న అనేక బై లాల‌ను స‌వ‌రించారు. పార్టీలో 10 ఏళ్ల ప్రాథమిక సభ్యత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాల‌నేది ఈ స‌వ‌రించిన నిబంధ‌న‌ల్లో ఒక‌టి. 

హైకోర్టు తీర్పుకు ముందు ఈ ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల ఇరువర్గాల మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. సమీపంలో పార్క్ చేసిన వాహనాలను కొందరు వ్య‌క్తులు ధ్వంసం చేశారు. ఇవ‌న్నీ అక్క‌డున్న కెమెరాల్లో క‌నిపించాయి. కాగా.. చట్ట ప్రకారం కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ మాత్రమే సమావేశాన్ని ఏర్పాటు చేయగలరని ఓపీఎస్ శిబిరం కోర్టు ముందు వాదించింది. కొత్తగా నియమితులైన ప్రిసీడియం ఛైర్మన్‌తో ఈ సమావేశం టెక్నిక‌ల్ గా చ‌ట్ట‌విరుద్ధమ‌ని పేర్కొన్నారు. సమావేశానికి సంబంధించిన ఆహ్వానంపై సంతకం చేయలేదని ఓపీఎస్ కూడా తెలిపారు. 

69 ఏళ్ల వ‌య‌స్సులో మ‌రో సారి తండ్రి కాబోతున్న పుతిన్.. ?

అయితే జూన్ 23న జరిగిన మునుపటి సమావేశం ఇద్దరు నేతల ఎన్నికను ఆమోదించనందున ద్వంద్వ నాయకత్వం అమలులో లేదని, అందువల్ల సమావేశాన్ని ప్రెసిడియం ఛైర్మన్ ఏర్పాటు చేయడం, ఆఫీస్ బేరర్లు ఆహ్వానాలు పంపడం చట్టబద్ధమైనదని EPS వ‌ర్గం వాదించింది. అయితే గత వారం చట్టానికి అనుగుణంగా సమావేశాన్ని నిర్వహించేందుకు ఈపీఎస్‌ బృందానికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. EPS ఏక నాయకత్వాన్ని కోరుకుంటుండగా, OPS ప్రస్తుత ద్వంద్వ నాయకత్వ నమూనాను కొనసాగించాలని కోరుకుంటోంది.