రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయంపై రష్యా మీడియాలో కథనాలు వెలువుడుతున్నాయి. అయితే ఈ వార్తలపై పుతిన్ స్పందించలేదు.
ఓ వైపు ఉక్రెయిన్ కు రష్యాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే ఈ సమయంలో ఓ వార్త అంతర్జాతీయ మీడియాను మొత్తం వ్లాదిమిర్ పుతిన్ వైపునకు ఆకర్శిస్తోంది. 69 ఏళ్ల వయస్సులో రష్యా అధ్యక్షుడు మరో సారి తండ్రి కాబోతున్నట్టు రష్యా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఒక్క ఎమ్మెల్యేకు రూ. 40 కోట్లను బీజేపీ ఆఫర్ చేస్తున్నది: ఫిరాయింపు వార్తలపై గోవా కాంగ్రెస్ నేత
పుతిన్ తన జిమ్నాస్ట్ ప్రేమికురాలితో కలిసి మరో బిడ్డకు తండ్రయ్యేందుకు సిద్ధమయ్యాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. ‘డైలీ స్టార్’ కథనాల ప్రకారం.. అధ్యక్షుడు పుతిన్ అతడి స్నేహితురాలు అలీనా కబేవా మూడోసారి గర్భం దాల్చింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఇప్పటికే పుకార్లు వచ్చాయి, అయితే ఇప్పుడు వారి కుటుంబం మరో కుమార్తెకు ఆహ్వానం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
దారుణం.. 14 ఏళ్ల బాలికపై ఐదు నెలల పాటు గ్యాంగ్ రేప్.. ఉత్తరప్రదేశ్ లో ఘటన
అయితే తన గర్ల్‌ఫ్రెండ్ గర్భం దాల్చిందని, తను మళ్లీ తండ్రి కాబోతున్నాడని తెలుసుకున్నపుతిన్.. ఈ విషయంలో సంతోషంగా లేరని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తనకు చాలా మంది పిల్లలు, కుమార్తెలు కూడా ఉన్నారని అనుకుంటున్నారని నివేదికలు వెలువడుతున్నాయి. కాగా పుతిన్ ప్రేయసి అలీనా కబేవా ఒలింపిక్స్‌లో బంగారు పతక విజేత అనే విషయం తెలిసిందే.
Ukraine war : చాసివ్ యార్ సిటీని ఢీకొట్టిన రష్యా క్షిపణి.. 15 మంది మృతి..
అలీనా కబేవా రష్యా అధ్యక్షుడి కుటుంబంలో భాగంగా ఉన్నారని గుర్తిస్తారు. అయితే ఇద్దరూ తమ సంబంధాన్ని రహస్యంగా ఉంచారు. కబేవా 2015లో మాస్కోలో ఇద్దరు కవల కుమారులకు జన్మనిచ్చిన తర్వాత స్విట్జర్లాండ్‌లోని ఓ వీఐపీ క్లినిక్‌లో మగబిడ్డకు జన్మనిచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే పుతిన్ తనకు ఎంత మంది పిల్లలు ఉన్నారో ఇంత వరకు ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. కానీ మాజీ భార్య లియుడ్మిలా ఓచెరెట్నాయతో పుతిన్ కు ఇద్దరు కుమర్తెలు ఉన్నారని పలు సందర్భాల్లో తెలియజేశారు. ఆ ఇద్దరు కుమార్తెలు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. వారిలో ఒకరు 37 ఏళ్ల వ్యాపారవేత్త మరియా వొరోంట్సోవా కాగా.. మరొకరు 35 ఏళ్ల డ్యాన్సర్ కాటెరినా టిఖోనోవా.
