Asianet News TeluguAsianet News Telugu

మనీలాండరింగ్ : మహారాష్ట్ర మాజీ హోమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు లుకౌట్ నోటీసులు...

ఈడీ కేసు నమోదుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి పదవికి దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ గతంలో అనిల్ దేశ్ ముఖ్ కు నోటీసు జారీ చేసింది. గతంలో ఈడీ పలు సమన్లు జారీ చేసినా దాటవేసినందున దేశ్ ముఖ్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి లుకౌట్ సర్క్యూలర్ ను ఈడీ జారీ చేసింది. 

ED issues lookout notice against former Maharashtra minister Anil Deshmukh
Author
Hyderabad, First Published Sep 6, 2021, 10:54 AM IST

న్యూ ఢిల్లీ : మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ ముఖ్ కు ఈడీ లుకౌట్ నోటీసు జారీ చేసింది. దేశ్ ముఖ్ పై అవినీతి ఆరోపణలు, ఆర్థిక అక్రమాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తాజాగా అతనికి లుకౌట్ నోటీసు జారీ చేసింది. 

ఈడీ కేసు నమోదుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి పదవికి దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ గతంలో అనిల్ దేశ్ ముఖ్ కు నోటీసు జారీ చేసింది. గతంలో ఈడీ పలు సమన్లు జారీ చేసినా దాటవేసినందున దేశ్ ముఖ్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి లుకౌట్ సర్క్యూలర్ ను ఈడీ జారీ చేసింది. 

గత నెలలో ఈడీ కేసులో మాజీ మంత్రికి ఉపశమనం ఇవ్వడానిక సుప్రంకోర్టు నిరాకరించింది. రూ. 100 కోట్ల లంచం ఆరోపణలపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది. ముంబై నగరంలోని బార్ లు, రెస్టారెంట్ ల నుంచి నెలకు రూ.100 కోట్లకు పైగా వసూలు చేయమని సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజీని అప్పటి రాష్ట్ర హోంత్రి అనిల్ కోరారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి లేఖ రాశారు. దీనిమీద ఏప్రిల్ 21న బొంబాయి హైకోర్టు ఆదేశం ఆధారంగా దేశ్ ముఖ్ మీద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios