సోనియా గాంధీని ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ ప్రశ్నించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా లోక్ సభలో కాంగ్రెస్ సభా పక్ష నాయకులు అధిర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. కేంద్రం ఈడీని ఇడియట్ గా మార్చిందని అన్నారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను 'ఇడియట్'గా మార్చిందని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్-అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ విచారణలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని దర్యాప్తు సంస్థ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఇలాంటి ప్రకటన చేశారు. చౌదరి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావల్లా కాంగ్రెస్ ‘సత్యాగ్రహం’ను ‘స్కామాగ్రా’, ‘దురాగ్రా’లుగా అభివర్ణించారు. గాంధీ కుటుంబంలోని ఎవరైనా ప్రశ్నించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టు, సాయుధ బలగాలు, ఇతర వివాదాలపై దాడి చేస్తుందని ఆయన ఆరోపించారు. ‘‘ అధీర్ రంజన్ చౌదరి ఇంటర్వ్యూలో EDని ‘ఇడియట్’ అని పిలిచారు - ఇది సత్యాగ్రహమా లేదా దురాగ్రహమా? ’’ అని ఆయన ప్రశ్నించారు. అవినీతిలో నిందితులైన కుటుంబాన్ని రక్షించడానికి, చట్టాన్ని అమలు చేసే సంస్థలను దుర్వినియోగం చేయడానికి, బెదిరించడానికి చేసే ప్రయత్నం ఇది అని పూనావాలా అన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఈ నిరసనను ‘సత్యాగ్రహ్’గా అభివర్ణించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని విచారిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. డీఎంకే, సీపీఐ-ఎం, సీపీఐ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, టీఆర్‌ఎస్, ఎండీఎంకే, ఎన్సీపీ, వీసీకే, శివసేన, రాష్ట్రీయ జనతాదళ్ సహా ప్రతిపక్ష పార్టీలు నేడు పార్లమెంట్‌లో సమావేశం అయ్యాయి.
కలిసి కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీల దుర్వినియోగం చేస్తోందంటూ ఉమ్మడి ప్రకటన చేశాయి. ‘‘ దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ద్వారా మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై ఎడతెగని ప్రచారాన్ని ప్రారంభించింది. అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. అపూర్వమైన రీతిలో వేధింపులకు గురిచేస్తోంది ’’ అని ఆ ప్రకటన పేర్కొంది.
శివసేన చీలిక.. సంజయ్ రౌత్ కారణం: రాందాస్ అథవాలే
కాగా.. కాంగ్రెస్ నేతల నిరసనలపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కూడా అసహంన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేది సత్యాగ్రహం కాదని, ఇది నిజానికి దురాగ్రహం అని అన్నారు. ‘‘ వాస్తవానికి ఈ కేసులో వారు (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ) బెయిల్‌పై ఉన్నారు. వివిధ కోర్టుల నుంచి ఉపశమనం పొందలేదు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల జేబు పార్టీగా మారింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆస్తులను జేబులో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా అదే ప్రయత్నం జరుగుతోంది.ఇది గాంధీ కుటుంబాన్ని రక్షించడం “సత్యగహ్” కాదు దేశం, దాని చట్టాలు, దాని ఏజెన్సీలకు వ్యతిరేకంగా చేసే “దురాగ్రా” (మొండి డిమాండ్). వేల కోట్ల రూపాయల విలువైన పార్టీ ఆస్తులను జేబులో వేసుకున్న కుటుంబాన్ని రక్షించడానికి చేస్తున్న పని ’’ అని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
